Mithali Raj Interesting Facts: మిథాలీరాజ్‌ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం?

8 Jun, 2022 21:45 IST|Sakshi

భారత సీనియర్‌ మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించింది. 23 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న మిథాలీరాజ్‌ 39 ఏళ్ల వయసుకు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఆమె ఆటకు రిటైర్మెంట్‌ ఇవ్వడంతో.. మిథాలీ పెళ్లి ఎందుకు చేసుకోలేదన్న ప్రస్తావన మరోసారి తెరమీదకు వచ్చింది.

వాస్తవానికి మిథాలీ 22 ఏళ్లు వయసులోనే ఆమె కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. క్రికెట్‌లో బిజీగా ఉన్న మిథాలీ ఎన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేసుకుంటూ వెళ్లింది. 27-30 ఏళ్లు వచ్చిన తర్వాత మిథాలీరాజ్  పెళ్లి గురించి ఆలోచించింది. అప్పుడు వచ్చిన సంబంధాల్లో చాలా మంది క్రికెట్‌ని వదిలేయాలని చెప్పడంతో.. అలాంటి వారు తనకు అవసరం లేదని ఇంట్లోవాళ్లతో చెప్పేసింది. అలా మిథాలీ క్రికెట్‌ కెరీర్‌ కోసం తన పర్సనల్ లైఫ్‌ని.. పెళ్లిని త్యాగం చేసింది.

అయితే పెళ్లి చేసుకోనందుకు తానేం బాధపడడం లేదని.. సింగిల్ లైఫ్‌ చాలా సంతోషంగా ఉందని ఒక సందర్భంలో మిథాలీ చెప్పుకొచ్చింది. 'కొన్నాళ్ల క్రిందట నాకు పెళ్లి ఆలోచన వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఎందుకంటే పెళ్లైన వాళ్లను చూసిన తర్వాత సింగిల్‌గా ఉండడమే చాలా బెటర్ అనిపిస్తోంది.' అంటూ పేర్కొన్న మిథాలీ ఇప్పటికి సింగిల్‌గానే బతికేస్తుంది. మరి రిటైర్మెంట్‌ తర్వాత ఒక తోడు కోసం పెళ్లి గురించి ఆలోచిస్తుందేమో చూడాలి.


ఇక డిసెంబర్ 3, 1982న రాజస్థాన్‌లో జోద్‌పూర్‌లో జన్మించిన మిథాలీ రాజ్, హైదరాబాద్‌లో చదువుకుంది. ఆంధ్రా టీమ్ తరుపున దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడిన మిథాలీ రాజ్... ఎయిర్ ఇండియా, రైల్వేస్ టీమ్స్ తరుపున కూడా ప్రాతినిథ్యం వహించింది.అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచులు ఆడిన మిథాలీ రాజ్... టెస్టుల్లో 699, వన్డేల్లో 7805, టీ20ల్లో 2364 పరుగులు చేసింది. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మిథాలీరాజ్‌ చరిత్ర సృష్టించింది.

చదవండి: Mitali Raj Intresting Facts: మిథాలీరాజ్‌లో మనకు తెలియని కోణాలు..

శెభాష్‌ మిథూ: 23 ఏళ్ల కెరీర్‌.. అరుదైన రికార్డులు! హ్యాట్సాఫ్‌!

మరిన్ని వార్తలు