షమీ రిటైర్డ్‌ హర్ట్‌ కాదు.. రిటైర్డ్‌ అవుట్‌

19 Dec, 2020 12:18 IST|Sakshi

అడిలైడ్‌ : ఆసీస్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో రెండో ఇన్నింగ్‌లో టీమిండియా అనూహ్యంగా 36 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ముగించిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా టెస్టుల్లో అత్యంత తక్కువ స్కోరుతో చెత్త రికార్డు నమోదు చేసింది. కాగా టీమిండియా ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ షమీ రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరగడం ఒక ఆసక్తికర చర్చకు తెరలేపింది. అదే 'రిటైర్డ్‌ అవుట్'‌..

సాధారణంగా క్రికెట్‌లో 'రిటైర్డ్‌ హర్ట్'‌ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. బ్యాటింగ్‌ సమయంలో ఎవరైనా బ్యాట్స్‌మన్‌ గాయపడినా లేక అనారోగ్య కారణాలు ఉంటే అంపైర్‌ అనుమతితో ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ తీసుకునే అవకాశం ఉంటుంది.అయితే ఒక్కసారి రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన ఆటగాడు మళ్లీ బ్యాటింగ్‌కు రావాలనుకుంటే మాత్రం అతనికి అవకాశం కల్పిస్తారు. తాజాగా ఐసీసీ సవరించిన నిబంధనల ప్రకారం రిటైర్డ్‌ హర్ట్‌ అయిన ఆటగాడి స్థానంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ను వినియోగించుకునే కొత్త రూల్‌ను జట్లకు కల్పించారు. (చదవండి : టీమిండియాకు ఏమైంది..?)

అయితే రిటైర్డ్‌ అవుట్‌ మాత్రం దీనికి పూర్తిగా విరుద్దం. ఒక బ్యాట్స్‌మన్‌ అంపైర్‌ అనుమతి లేకుండా.. తన సొంతంగా నిర్ణయం తీసుకొని ఇన్నింగ్స్‌ కొనసాగించకుండా బయటికే వెళ్లిపోవడాన్ని రిటైర్డ్‌ అవుట్‌గా పరిగణిస్తారు. రిటైర్డ్‌ అవుట్‌గా ఎవరైనా బ్యాట్స్‌మన్‌ బయటికి వెళ్లిపోతే మళ్లీ ఆడేందుకు అనుమతించరు.క్రికెట్‌ చరిత్రలో రిటైర్డ్‌ అవుట్‌గా వెళ్లడం చాలా అరుదుగానే జరుగుతుంది. కాగా, ఒక టెస్టు మ్యాచ్‌లో రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు ఒక టెస్టు మ్యాచ్‌లోనే రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగారు. వారే ఆటపట్టు, జయవర్దనే. 2001వ సంవత్సరంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.  (చదవండి : టీమిండియా.. 4,9,2,0,4,0,8, 4,0,1)

Poll
Loading...
మరిన్ని వార్తలు