Rachin-Ajaz Patel: రచిన్‌, ఎజాజ్‌ పటేల్‌.. భారత్‌తో బంధం

30 Nov, 2021 07:31 IST|Sakshi

Intresting Facts About Rachin Ravindra And Ajaz Patel.. కివీస్‌ను ఓటమి నుంచి రక్షించిన ఇద్దరు ఆటగాళ్లకు మన దేశపు నేపథ్యం ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన రచిన్‌ రవీంద్ర వెల్లింగ్టన్‌లో పుట్టినా... అతని తండ్రి రవి కృష్ణమూర్తి భారత్‌కు చెందినవాడు. స్వస్థలం బెంగళూరు కాగా... సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన కృష్ణమూర్తి వేర్వేరు దేశాల్లో ఉద్యోగం చేస్తూ చివరకు న్యూజిలాండ్‌లో స్థిరపడ్డాడు. క్లబ్‌ స్థాయి క్రికెట్‌లో తనతో కలిసి ఆడిన జవగల్‌ శ్రీనాథ్‌తో అతనికి మంచి స్నేహం ఉంది. రాహుల్‌ ద్రవిడ్, సచిన్‌ టెండూల్కర్‌ పేర్ల కలయికతో తన కొడుకుకు ‘రచిన్‌’ పేరు పెట్టిన కృష్ణమూర్తి సరైన సాధన, పోటీ కోసం భారత్‌లోనే వేర్వేరు నగరాలకు తరచుగా అతడిని పంపించి రెగ్యులర్‌ ప్రాక్టీస్‌ చేయిస్తూ వచ్చాడు. 33 ఏళ్ల ఎజాజ్‌ పటేల్‌ ముంబైలోనే పుట్టాడు. 1996లో అతని కుటుంబం న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. 

భారత్‌లో భారత జట్టుపై నాలుగో ఇన్నింగ్స్‌లో 95 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లు ఆడి టెస్టు మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించడం న్యూజిలాండ్‌ జట్టుకిది ఐదోసారి. గతంలో న్యూజిలాండ్‌ జట్టు కాన్పూర్‌ (1976), మొహాలీ (1999), అహ్మదాబాద్‌ (1999), అహ్మదాబాద్‌ (2003) టెస్టుల్లో కూడా ఇలాగే ‘డ్రా’ చేసుకుంది.

చదవండి: Rachin Ravindra Facts: ఎవరీ రచిన్‌ రవీంద్ర.. సచిన్‌, ద్రవిడ్‌తో ఏంటి సంబంధం?

పేర్లలో కన్ఫ్యూజన్‌.. ఈసారి జడేజాదే పైచేయి

మరిన్ని వార్తలు