Virat Kohli Tattoos: కోహ్లి చేతిపై 11 పచ్చబొట్ల వెనుక రహస్యం ఏంటంటే..

25 Jun, 2022 16:14 IST|Sakshi

విరాట్‌ కోహ్లి.. టీమిండియా మాజీ కెప్టెన్‌.. స్టార్‌ క్రికెటర్‌. ఈ ఒక్క పదం అతనికి సరిపోదు. ఎందుకంటే సచిన్‌ తర్వాత బ్యాటింగ్‌లో టీమిండియా కింగ్‌లా మారిన కోహ్లి ఎన్నో ఘనతలు అందుకున్నాడు. మానసికంగా, శారీరకంగా ఎంతో ఫిట్‌గా కనిపించే కోహ్లి మైదానంలోనే అంతే అగ్రెసివ్‌గా ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో లెక్కలేనన్ని రికార్డులు సాధించిన కోహ్లి ఇప్పటి యూత్‌కు ఒక ఐకాన్‌. మరి అంత పాపులారిటీ సాధించిన కోహ్లి చేతిపై ఉన్న 11 పచ్చబొట్ల గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా. అయితే ఇది చదివేయండి. కోహ్లి రెండు చేతులకు  11 పచ్చబొట్లు ఉంటాయి. ఒక్కో పచ్చబొట్టుకు ఒక్కో అర్థం దాగి ఉంటుంది. 

పచ్చబొట్లుగా తల్లిదండ్రుల పేర్లు..


తొలి పచ్చబొట్టు కోహ్లి తల్లిదండ్రులది. సరోజ్‌, ప్రేమ్‌ అని కోహ్లి ఎడమ చేతిపై భుజ భాగంలో రాసి ఉంటుంది. 18వ ఏటనే అతని తం‍డ్రి మరణించాడు. తండ్రి అంటే చాలా ఇష్టమున్న కోహ్లి తండ్రి గుర్తుగా ఈ పచ్చబొట్టును పొడిపించుకున్నాడు. ''మాటల్లో చెప్పలేని ఒక కనెక‌్షన్‌  నా తల్లిదండ్రులతో ఉంది. అది అనుభూతి చెందడానికే వారిపేర్లు పచ్చబొట్టు వేయించుకున్నా. నేను చనిపోయేవరకు వారి పేర్లు నా చేతిపై శాశ్వతం'' అని ఒక సందర్బంలో కోహ్లి చెప్పుకొచ్చాడు. 


కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సందర్బాలను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. 2008లో శ్రీలంకతో మ్యాచ్‌ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన కోహ్లి టీమిండియా తరపున 175వ క్యాప్‌ అందుకున్నాడు. ఇక 2011లో టెస్టుల్లో అరంగేట్రం ఇచ్చిన కోహ్లి 269వ ఆటగాడిగా అడుగుపెట్టాడు. వన్డే, టెస్టు అరంగేట్రానికి గుర్తుగా 175, 269లను పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు.

గాడ్స్‌ హై టాటూ..


కోహ్లి మూడో పచ్చబొట్టు దేవుడి కన్నుగా ఉంటుంది. దేవుడు ఆ కన్నుతో తనను చూస్తున్నాడని.. ఈ పచ్చబొట్టు సారాంశం ఏంటంటే.. ఒక మనిషిగా జీవితాన్ని అర్థం చేసుకోవడంతో పాటు నేను ఏం చేయాలి అనేది చూపిస్తుంది అని కోహ్లి ఒక సందర్బంలో వివరించాడు.

ఓం శబ్దం పచ్చబొట్టుగా..


ఓంకార శబ్దం వింటే చాలు భక్తుల పులకించిపోతారు. నన్ను కూడా ఓం అంతలా ఆకట్టుకుంది. విశ్వంలో ఓం అనే పదానికి చాలా అర్థం ఉందని కోహ్లికి నమ్మకం. అంతేకాదు ఓం అనే పచ్చబొట్టు కోహ్లికి ఎంత ఎదిగినా తన మూలాలు గుర్తుచేస్తుందట.

స్కార్పియో టాటు..

విరాట్‌ కోహ్లి రాశి వృశ్చికం. నవంబర్‌లో పుట్టిన ‍కోహ్లి రాశి అదేనంట. వృశ్చిక రాశి ఉన్నవారు జీవితంలో స్రాంగ్‌గా ఉంటారని.. ఎలాంటి చాలెంజ్‌నైనా సమర్థంగా ఎదుర్కొంటారని కోహ్లి నమ్మకం. అందుకే వృశ్చిక రాశికి ఇంగ్లీష్‌ పదమైన స్కార్పియోనూ పచ్చబొట్టుగా వేయించుకున్నాడు.

కోహ్లి చేతికి ఉన్న ఆరో పచ్చబొట్టు జపనీస్‌ సమురాయ్‌. జపనీస్‌ సమురాయ్‌ అంటే ఒక మిలటరీ అధికారి ఒక యుద్దం తర్వాత మరొక యుద్దానికి వెళుతుంటారు. అయితే ఈ యుద్దానికి వెళ్లేటప్పుడు ఏడు ధర్మాలు పాటిస్తారంట. అవి న్యాయం, ధైర్యం, నిజాయితీ, నిబద్ధత, పరోపకారం, మర్యాద.. ఈ ఏడు తన జీవితంలో కూడా ఉండేలా చూసుకునేవాడినని .. అందుకే పచ్చబొట్టుగా పొడిపించుకున్నానని చెప్పుకొచ్చాడు. రోజు ఉదయం లేవగానే కోహ్లి మొదట చూసుకునేది జపనీస్‌ సమురాయ్‌ అంట.

లార్డ్‌ శివ.. 


కోహ్లికి శివుడు అంటే చాలా ఇష్టం. తనకు ఏం కష్టమొచ్చినా చిన్నప్పటి నుంచి శివుడినే ఆరాధించేవాడు. అందుకే శివుడి రూపాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ఇవేగాక కోహ్లి చేతిపై మొనాస్ట్రీ(ఏ విషయంలోనైనా ఫోకస్‌గా ఉండేలా), ట్రైబల్‌ ఆర్ట్‌(తనపై తనకు నమ్మకం) పచ్చబొట్లు ఉంటాయి.

చదవండి: 'కోహ్లికి ధోని అండ.. పాక్‌లో పుట్టడం నా దురదృష్టం'

మరిన్ని వార్తలు