Cricketers Holy Celebrations: రోహిత్‌ది తిండిగోల.. కోహ్లీ, ధోని ఎకో ఫ్రెండ్లీ బాటలో

18 Mar, 2022 11:44 IST|Sakshi

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రెండేళ్లుగా మాయదారి కరోనాతో రంగుల పండుగకు దూరమైన ప్రజలు ఈసారి మాత్రం రెట్టింపు ఉత్సాహంతో వేడుకను జరుపుకుంటున్నారు. మరి క్రికెటర్లు కూడా హోలీ వేడుకలు తమస్టైల్లో జరుపుకోవడం చూస్తుంటాం. అయితే హోలీ రోజు సాయంత్రానికో.. లేక మరునాడో వాళ్ల పండుగ సెలబ్రేషన్స్‌ను వీడియో రూపంలో షేర్‌ చేస్తుంటారు. అయితే క్రికెటర్లు ఆ వీడియో పెట్టడానికి ముందే ఏ విధంగా హోలీ పండుగ జరుపుకుంటారనేది ముందుగానే తెలుసుకుందాం. దేశంలో వివిధ ప్రాంతాల్లో రకరకాల పద్దతుల్లో హోలీ జరుపుకుంటారు. మరి మన క్రికెటర్లు ఏ జాబితాలో ఉన్నారు.. అభిమానులు వారిని ఎక్కడ ఉంచారనేది ఊహాతీతంగా చూద్దాం. 
-సాక్షి, వెబ్‌డెస్క్‌

బెలూన్‌ ఫైటింగ్‌ హోలీ

బెలూన్స్‌లో రంగు నీళ్లు నింపి ఒకరిపై ఒకరు కొట్టుకుంటూ సరదాగా ఆడుకుంటారు. కాస్త చిన్నపిల్లలు ఎక్కువగా ఆడే ఈ ఆటకు మన క్రికెటర్లు కొందరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. రిషబ్‌ పంత్‌, యజ్వేంద్ర చహల్‌, జేమ్స్‌ నీషమ్‌, డేవిడ్‌ వార్న్‌ర్‌ ఈ జాబితాలో ఉంటారు. 

నో కలర్‌.. పీస్‌ హోలీ


హోలీ పండుగ రోజున బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ మ్యూజిక్‌ను ఆస్వాధిస్తూ పండుగను జరుపుకుంటారు. స్వతహగా రంగులు చల్లుకోవడం, బెలూన్స్‌ ఫైటింగ్‌ హోలీ ఆడడం వీళ్లకు ఇష్టం ఉండదు. ఈ జాబితాలో చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, మహ్మద్‌ నబీ లాంటి క్రికెటర్లు ఉంటారు. 

పెయింట్‌ అండ్‌ గ్రీస్‌ హోలీ


ఇది కాస్త విభిన్నంగా ఉంటుంది.  ముఖానికి గ్రీస్‌, పెయింట్‌ లాంటివి పూసుకొని పండుగను జరుపుకుంటున్నారు. ఇటువంటి వారిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. మనకు తెలిసినంత వరకు ఈ జాబితాలో హార్దిక్‌ పాండ్యా, ఆండ్రీ రసెల్‌, ఇషాన్‌ కిషన్‌, డ్వేన్‌ బ్రేవో లాంటి క్రికెటర్లు ఉంటారు. స్వతహగా మైదానంలో ఈ క్రికెటర్లు ఎంతో చురుకుగా ఉంటారు. కచ్చితంగా హోలీ రోజు సాయంత్రం మాత్రం ఎక్కువసేపు బాత్‌టబ్‌లో ఉండడానికి ఇష్టపడుతారు.

ఎకో ఫ్రెండ్లీ హోలీ


పర్యావరణానికి హాని కలిగించకుండా సహజమైన రంగులతో జరుపుకోవడానికి ఇష్టపడుతారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోనితో పాటు విరాట్‌ కోహ్లి, భువనేశ్వర్‌, డుప్లెసిస్‌లు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆట లేనప్పుడు వీరు ఎక్కువగా ఫ్యామిలీతో ఎక్కువ సమయం కేటాయించేందుకు ఇష్టపడుతారు.

స్వీట్‌, ఫుడ్‌ హోలీ సెలబ్రేషన్స్‌


హోలీ రోజున అందరు రంగులతో ఆడుకుంటే.. కొంతమంది మాత్రం తమకు ఇష్టమైన ఫుడ్‌ను లాగించేస్తుంటారు. అందరిలో భిన్నంగా కనిపించే ఇలాంటి వారిలో మన క్రికెటర్లు కూడా ఉన్నారు. మంచి ఆహార ప్రియుడైన రోహిత్‌ శర్మ ఈ జాబితాలో కచ్చితంగా ఉంటాడు. రోహిత్‌తో పాటు శిఖర్‌ ధావన్‌, రవిశాస్త్రి, మార్కస్‌ స్టోయినిస్‌ సహా మరికొంతమంది ఆటగాళ్లు పండుగ రోజున తమ ఇష్టమైన ఆహారాన్ని లాగించేందుకు ఇష్టపడుతారు.

చదవండి: Womens WC 2022 WIW vs BANW: విండీస్‌ క్రికెటర్‌ వింత ప్రవర్తన.. సూపర్‌ అంటున్న ఫ్యాన్స్‌

IPL 2022: కప్‌ గెలుస్తారో లేదో తెలీదు.. మా మనసులు దోచుకున్నారు

మరిన్ని వార్తలు