Cricket In Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్.. త్వరలోనే ప్రకటన..!

4 Aug, 2022 18:14 IST|Sakshi

జెంటిల్మెన్‌ గేమ్‌ క్రికెట్‌ త్వరలో విశ్వక్రీడల్లో భాగంగా కానుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. 2028 లాస్ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసే అంశాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వర్గాలు వెల్లడించాయి. క్రికెట్‌ సహా మరో 8 కొత్త క్రీడలను ఒలింపిక్స్ క్రీడల తుది జాబితాలో చేర్చినట్లు సమాచారం. 

ఈ జాబితాపై ఐఓసీ త్వరలోనే సమీక్ష నిర్వహించి 2028 ఒలింపిక్స్‌లో ఏఏ క్రీడలకు అనుమతి ఇవ్వాలో తేల్చనుంది. వచ్చే ఏడాది ముంబైలో జరిగే సమావేశాల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది. క్రికెట్‌తో పాటు బేస్ బాల్/సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్, లాక్రోస్సే, బ్రేక్ డ్యాన్సింగ్, కరాటే, కిక్ బాక్సింగ్, స్క్వాష్, మోటార్ స్పోర్ట్ క్రీడలను ఒలింపిక్స్‌లో చేర్చేందుకు ఐఓసీ ప్రతపాదించింది. కాగా, 1900 సంవత్సరంలో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ తొలిసారి విశ్వక్రీడల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 
చదవండి: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ ఎవరంటే..?

మరిన్ని వార్తలు