నటాషా,‌ అగస్త్య ఫోటో షేర్‌ చేసిన పాండ్యా

25 Sep, 2020 12:38 IST|Sakshi

టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, భార్య నటాషా స్టాంకోవిచ్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటూ పలు ఆసక్తికరమైన అంశాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.  ఈ క్యూట్‌ జంట జూలై 30న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన తన కుమారుడికి అగస్త్య అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని హార్ధిక్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.  (కెరీర్‌లో ఇలాంటి గాయాలు సహజమే : హార్దిక్‌)

ప్రస్తుతం ఐపీఎల్‌ ప్రారంభం కావడంతో హార్ధిక్‌ దుబాయ్‌ పయనమయ్యాడు. పాండ్యా ముంబై ఇండియన్స్‌ టీంలో ఆడుతున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ముంబై ఇండియన్స్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను హార్ధిక్‌ భార్య నటాసా, బేబీబాయ్‌ టీవీలో తిలకిస్తున్న ఫోటోను హార్ధిక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ముంబై ఇండియన్స్‌ను ఉత్సాహపరిస్తున్న ఈ ఫోటోలో నటాసా, అగస్త్యా ముంబై ఇండియన్స్‌ టీ షర్టులు ధరించి టీవీలో ఐపీఎల్‌ చూస్తున్నారు. కాగా.. పాండ్యా ఈ పోస్ట్‌కి క్వీన్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌.. కోల్‌కత్తాపై 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌ విజయం సాధించడం హర్ధిక్‌కు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది.  (పాండ్యా, నటాషా ఫోటోను తొలగించిన ఇన్‌స్టాగ్రామ్‌)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు