‘ఐపీఎల్‌ 12 సీజన్లలోకి ఇదే హైలైట్‌’

25 Jul, 2020 20:26 IST|Sakshi

ఢిల్లీ: ఐపీఎల్‌-2020 అన్ని సీజన్లోకి హైలైట్‌గా నిలుస్తుందని మాజీ క్రికెటర్‌, ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ అన్నారు. ఈ ఐపీఎల్‌లో ఏ జట్టు టైటిల్‌ సాధిస్తుంది, ఏ ఆటగాడు బాగా ఆటతాడు అనే విషయానికి అంతగా ప్రాధాన్యం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దేశం, యావత్‌ ప్రపంచం కరోనా భయాలు నెలకొన్న నేపథ్యంలో జరుగుతున్న క్రికెట్‌ వేడుక కాబట్టి వేదిక ఎక్కడైనా జోష్‌ మాత్రం తగ్గదని అన్నారు. ఇక ఐపీఎల్‌-2020 యూఏఈలో నిర్వహించడం కూడా కలిసి వస్తుందని చెప్పారు. యూఏఈ క్రికెట్‌ టోర్నీలకు అద్బుతమైన వేదిక అని పేర్కొన్నారు. ఈ సీజన్‌ జాతి మూడ్‌ను మారుస్తుందని గంభీర్‌ ఆకాక్షించారు. 
(చదవండి: సచిన్‌ పాజీతో మాట్లాడిన తర్వాతే: కోహ్లి)

ఇక మార్చి 29న నిర్వహించాల్సిన ఐపీఎల్‌-2020 కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడటంతో.. ఆ సమమాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు తాజా ఐపీఎల్‌ కొనసాగనుంది. ఇక ఐపీఎల్‌-2020 ని యూఏఈలో నిర్వహిస్తామని ఐపీఎల్‌ నిర్వహణ కమిటీ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ ఇదివరకే ప్రకటించారు. టోర్నీకి సంబంధించి పూర్తి వివరాలు వచ్చేవారం వెల్లడికానున్నాయి.  కాగా, గంభీర్‌ సారథ్యంలో కోల్‌కత నైట్‌ రైడర్స్‌ రెండు సార్లు ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిన సంగతి తెలిసిందే. 
(సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం : బ్రిజేష్‌)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు