CSK Vs PBKS: కేఎల్‌ రాహుల్‌(98 నాటౌట్‌) సుడిగాలి ఇన్నింగ్స్‌.. పంజాబ్‌ సూపర్‌ విక్టరీ 

7 Oct, 2021 19:03 IST|Sakshi

కేఎల్‌ రాహుల్‌(98 నాటౌట్‌) సుడిగాలి ఇన్నింగ్స్‌.. పంజాబ్‌ సూపర్‌ విక్టరీ 
135 పరుగుల స్వల్స లక్ష్య ఛేదనలో పంజాబ్‌ జట్టు అదరగొట్టింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (42 బంతుల్లో 98 నాటౌట్‌; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడడంతో పంజాబ్‌ జట్టు కేవలం 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. రాహుల్‌ వరుస సిక్సర్లతో చెన్నై బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడడంతో మరో 42 బంతులు మిగిలుండగానే పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. సీఎస్‌కే బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు పడగొట్టగా, దీపక్‌ చాహర్‌కు ఓ వికెట్‌ దక్కింది.  

మూడో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌.. షారుఖ్‌ ఖాన్‌(8) ఔట్‌ 
దీపక్‌ చాహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ ఆఖరి బంతికి షారుఖ్‌ ఖాన్‌(10 బంతుల్లో 8; సిక్స్‌) ఔటయ్యాడు. భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి బ్రావో చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 9 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 80/3. క్రీజ్‌లో రాహుల్‌(59), మార్క్రమ్‌ ఉన్నారు. 

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు  కోల్పోయిన పంజాబ్‌.. 
పంజాబ్‌ కింగ్స్‌ ఒకే ఓవర్‌లో రెండు రెండు వికెట్లు కోల్పోయిందిశార్దుల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌లో  మయాంక్‌ అగర్వాల్(12)  ఎల్బీగా వెనుదిరగగా, సర్ఫరాజ్‌ ఖాన్‌(0) డుప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 7 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 62/2. క్రీజులో కేఎల్‌ రాహుల్(49), షారుఖ్ ఖాన్ ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌.. మయాంక్ అగర్వాల్( 12) ఔట్‌
135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ అగర్వాల్ రూపంలో తొలి వికెట్‌ కోల్పోయిందిశార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో అగర్వాల్  ఎల్బీగా వెనుదిరిగాడు. కాగా 4.3 ఓవర్లలో పంజాబ్‌ వికెట్‌ నష్టానికి 46 పరగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్‌ రాహుల్(50) ,సర్ఫరాజ్‌ ఖాన్‌(2) ఉన్నారు.

డుప్లెసిస్‌(76) ఒంటరి పోరాటం.. పంజాబ్‌ టార్గెట్‌ 135
ఓపెనర్‌ డుప్లెసిస్‌ (55 బంతుల్లో 76; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో సీఎస్‌కే జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. షమీ వేసిన ఆఖరి ఓవర్లో 16 పరుగులు రావడంతో సీఎస్‌కే ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, క్రిస్‌ జోర్డన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రవి బిష్ణోయి, మహ్మద్‌ షమీ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ధోని (12) మరోసారి విఫలం.. చెన్నై 61/5
సీఎస్‌కే సారధి ఎంఎస్‌ ధోని.. తన వైఫల్యాల పరంపరను కొనసాగిస్తున్నాడు. నేటి మ్యాచ్‌లోనూ 12 పరుగలకే ఔటై అభిమానులను నిరాశపరిచాడు. 12వ ఓవర్‌ ఆఖరి బంతికి రవి బిష్ణోయి బౌలింగ్‌లో ధోని క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో సీఎస్‌కే 61 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో డుప్లెసిస్‌(26), జడేజా ఉన్నారు. 

రాయుడు (4) ఔట్‌.. 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై
క్రిస్‌ జోర్డాన్‌ తన స్పెల్‌ రెండో ఓవర్లోనూ సీఎస్‌కేను దెబ్బకొట్టాడు. అంతకుముందు ఓవర్లో ఉతప్పను బోల్తా కొట్టించిన జోర్డాన్‌.. ఇన్నింగ్స్‌ 8.3వ ఓవర్లో రాయుడు(5 బంతుల్లో 4)ను కూడా పెవిలియన్‌ బాట పట్టించాడు. రాయుడు భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో అర్ష్‌దీప్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో సీఎస్‌కే 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్‌లో డుప్లెసిస్‌(21), ధోని ఉన్నారు. 

ఉతప్ప(2) ఔట్‌.. చెన్నై 32/3
క్రిస్‌ జోర్డాన్‌ వేసిన 6వ ఓవర్‌ ఐదో బంతికి రాబిన్‌ ఉతప్ప(6 బంతుల్లో 2) ఔటయ్యాడు. హర్ప్రీత్‌ బ్రార్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి అతను పెవిలియన్‌కు చేరాడు. దీంతో సీఎస్‌కే 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో డుప్లెసిస్‌(16), అంబటి రాయుడు ఉన్నారు. 

మొయిన్‌ అలీ డకౌట్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన చెన్నై
పంజాబ్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌.. చెలరేగి బౌలింగ్‌ చేస్తున్నాడు. వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి.. సీఎస్‌కేకు గట్టి షాకి​చ్చాడు. నాలుగో ఓవర్‌లో ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను పెవిలియన్‌కు పంపిన అతను.. ఆరో ఓవర్‌ 4వ బంతికి మొయిన్‌ అలీ(0)ని ఔట్‌ చేశాడు. మొయిన్‌ అలీ వికెట్‌కీపర్‌ కేఎల్‌ రాహుల్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రీజ్‌లో డెప్లెసిస్‌(15), రాబిన్‌ ఉతప్ప ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన చెన్నై.. రుతురాజ్‌(12) ఔట్‌
టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే వికెట్‌ కోల్పోయింది. ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(14 బంతుల్లో 12; ఫోర్‌).. అర్ష్‌దీప్‌  బౌలింగ్‌లో షారుఖ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 3.5 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 18/1. క్రీజ్‌లో డెప్లెసిస్‌(4), మొయిన్‌ అలీ ఉన్నారు. 

దుబాయ్‌: ఐపీఎల్‌-2021 రెండో దశలో భాగంగా గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభంకానున్న డబుల్‌ హెడర్‌ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇరు జట్లు 25 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా సీఎస్‌కే 16 .. పంజాబ్‌ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ప్రస్తుత సీజన్‌ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో ధోని సేన 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ను మట్టికరిపించింది. ఇక ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్ల పాయింట్ల విషయానికొస్తే.. సీఎస్‌కే 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో రెండో స్థానంలో ఉండగా, పంజాబ్‌ 13 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. 
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు,  ధోని (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

పంజాబ్ కింగ్స్ : కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, ఎయిడెన్ మర్క్రమ్‌, షారుఖ్ ఖాన్, సర్ఫరాజ్‌ ఖాన్‌, క్రిస్‌ జోర్డన్‌, హర్ప్రీత్‌ బ్రార్‌, మోసస్‌ హెన్రిక్స్‌, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: Michael Vaughan: ఆర్సీబీ ఓడిపోవడమే మంచిదైంది.. అసలు..

>
మరిన్ని వార్తలు