IPL 2021 Phase 2:  ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్న భారత ఆటగాళ్లు వీరే!

19 Sep, 2021 20:03 IST|Sakshi

క్రికెట్‌ అభిమానులు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా ఈవెంట్‌ ఐపీఎల్‌- 2021 సె​కండ్‌ ఫేజ్‌ ప్రారంభమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ ప్రారంభమైంది . అయితే ఈ సీజన్‌ తర్వాత కొంత మంది భారత ఆటగాళ్లు లీగ్‌కు వీడ్కోలు పలుకనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెరమీదకు వచ్చిన ఆ ఆటగాళ్లు ఎవరో పరిశీలిద్దాం.



హర్భజన్ సింగ్
హర్భజన్ సింగ్  భారత అత్యత్తుమ స్పిన్నర్లలోఒకడు. టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా 2001లో అరుదైన ఘనత సాధించాడు. ఇక ఐపీఎల్‌ విషయానికి వస్తే.. తన ఐపీఎల్ కెరీర్‌ను  ముంబై ఇండియన్స్‌తో ప్రారంభించాడు. పది సీజన్ల తరువాత 2018 లో ముంబై భజ్జీను వేలంలో పెట్టింది. తరువాత చెన్నై సూపర్ కింగ్స్ కనీస ధరతో అతడుని దక్కించుకోంది. ఆనంతరం రెండు సీజన్ల తరువాత 2021లో  చెన్నై కూడా హర్భజన్ ను వేలంలో పెట్టింది.

ఈ ఏడాది సీజన్‌లో ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. కానీ ఐపీఎల్‌ మెదటి దశలో కోల్‌కతా తరుపున అతడకి తుది జట్టులో పెద్దగా అవకాశం దక్కలేదు. ఈ ఏడాది జూలైలో 40వ పడిలోకి అడుగు పెట్టిన హర్భజన్ సింగ్.. ఐపీఎల్‌  సె​కండ్‌ ఫేజ్‌  పూర్తయిన తర్వాత  ఐపీఎల్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు తన ఐపీఎల్‌ కెరియర్‌లో 160 మ్యాచ్‌లు ఆడిన హర్భజన్ సింగ్ మొత్తం 150 వికెట్లు పడగొట్టాడు.

అమిత్ మిశ్రా 
అమిత్ మిశ్రా భారత లెగ్‌ స్పిన్‌ దిగ్గజం. ఇక ఐపీఎల్‌ విషయానికి వస్తే.. తన ఐపీఎల్ కెరీర్‌ను  ఢిల్లీ డెర్‌డెవిల్స్‌ తో ప్రారంభించాడు. ఆ తరువాత సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, పుణే వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం  ఢిల్లీ క్యాపిటల్స్ లో కొనసాగుతున్నాడు. కాగా ఐపీఎల్‌లో మిశ్రా తన పేరు మీద అనేక రికార్డులు కలిగి ఉన్నాడు.  ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా మిశ్రా ఉన్నాడు.

ఈ లీగ్‌లో అత్యధిక  హ్యాట్రిక్‌లు(3) సాధించిన బౌలర్‌గా అమిత్ మిశ్రా రికార్డు సాధించాడు. అయితే.. వెటరన్ స్పిన్నర్‌  కొన్ని నెలల్లో 39 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో ఇదే అతని అఖరి సీజన్ కావచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  కాగా ఇప్పటి వరకు తన ఐపీఎల్‌ కెరీర్‌లో 154 మ్యాచ్‌లు ఆడిన అమిత్ మిశ్రా 166 వికెట్లు సాధించాడు.

వృద్ధిమాన్ సాహా
సాహా తన కెరీర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ తో ప్రారంభించాడు. ఆ తరువాత మూడు సీజన్ల ఆనంతరం చెన్నై సూపర్ కింగ్స్‌, పంజాబ్‌కు ప్రతినిధ్యం వహించాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టులో కొనసాగుతున్నాడు. కాగా  ఐపీఎల్‌ సెకెండ్‌ ఫేజ్‌కు ఆజట్టు స్టార్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో దూరమయ్యాడు. ఈ క్రమంలో సాహా  హైదరాబాద్‌కు ఓపెనింగ్‌ చేసే అవకాశాఉ ఉన్నాయి. కాగా మరో నెలలో 37 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న  సాహా ఐపీఎల్‌కు గుడ్‌బై  చెప్పనున్నాడని  సమాచారం. కాగా  సాహా  తన ఐపీఎల్‌ కెరీర్‌లో 126 మ్యాచ్‌లు ఆడి 1987 పరుగులు సాధించాడు.


కేదార్ జాదవ్ 
కేదార్ జాదవ్  ఐపీఎల్‌లో ఆద్బతమైన ఆటగాడు  కానప్పటికీ, తన  ఐపీఎల్‌ కెరీర్‌లో కొన్ని మ్యాచ్‌లలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ ఆడాడు. జాదవ్ తన కేరిర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ప్రారంభించగా.. 2018లో అతడుని చెన్నై సూపర్ కింగ్స్‌ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆనంతరం 2021లో చెన్నై జాదవ్‌ను వేలంలో పెట్టింది. తరువాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కేదార్‌ను దక్కించుకోంది. 36 ఏళ్ల జాదవ్‌ ఫామ్‌లో లేనందున, ఇది అతని చివరి సీజన్ కావచ్చోని వినికిడి. కాగా జాదవ్‌ తన కేరిర్‌లో 91మ్యాచ్‌ల్లో 1181 పరుగులు సాధించాడు.

రాబిన్ ఉతప్ప
రాబిన్ ఉతప్ప తన ఐపీఎల్‌ కెరీర్‌ ను  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ప్రారంభించాడు. 2014 నుంచి 2019 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున అద్భతంగా రాణించాడు. 2014 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసి  ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఉతప్ప చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌ 2021 మొదటి దశలో చెన్నై తరుపున ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దొరకలేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు విడ్కోలు పలకవచ్చని సమాచారం.

చదవండిIPL 2021 2nd Phase CSK VS MI: రుతురాజ్‌ మెరుపులు.. ముంబై ఇండియన్స్‌ టార్గెట్‌ 157

>
మరిన్ని వార్తలు