IPL 2021: కెప్టెన్‌గా ధోని‌.. రైనాకు దక్కని చోటు

2 Apr, 2021 11:16 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్‌ ముంగిట ఆర్‌సీబీ పవర్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్ టీమ్‌ని ప్రకటించాడు. ఏబీ ప్రకటించిన టీమ్‌కు కెప్టెన్‌గా.. వికెట్‌ కీపర్‌గా ఎంఎస్‌ ధోనిని ఎంపిక చేశాడు. ఇక ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీని ఎన్నుకున్నాడు. అయితే నాలుగో స్థానంలో ఎవరు ఉంటారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఆ స్థానంలో కేన్‌ విలియమ్స్‌న్‌, స్టీవ్‌ స్మిత్‌తో పాటు తన పేరును కూడా డివిలియర్స్‌ ప్రకటించడం విశేషం. ఆల్‌రౌండర్ల కోటాలో బెన్‌ స్టోక్స్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేశాడు.

పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కగిసో రబడలకు అప్పగించగా.. స్పిన్ బాధ్యతల కోసం రషీద్ ఖాన్, జడేజాను పరిగణలోకి తీసుకున్నాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఆర్‌సీబీ డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో చెన్నై వేదికగా సీజన్‌ తొలి మ్యచ్‌ను ఆడనుంది. కాగా డివిలియర్స్‌ తన బెస్ట్‌ ఐపీఎల్‌ ఎలెవెన్‌ టీమ్‌ కెప్టెన్‌గా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి అత్యంత విజయవంతమన కెప్టెన్‌గా పేరు పొందిన రోహిత్‌ శర్మను కాదని ధోనికే ఓటు వేయడం ఇక్కడ విశేషం. అయితే ఐపీఎల్‌లో విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా పేరున్న సురేశ్‌ రైనాకు మాత్రం ఏబీ టీమ్‌లో చోటు దక్కలేదు.

ఆల్‌టైమ్ ఐపీఎల్ బెస్ట్ ఎలెవన్: వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్/ స్టీవ్‌స్మిత్ / ఏబీ డివిలియర్స్, బెన్‌స్టోక్స్, ఎంఎస్‌ ధోని (వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, కగిసో రబడ, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్
చదవండి: 
IPL 2021: కొత్త కెప్టెన్‌తో రాయల్స్‌కు కలిసొచ్చేనా!

వైరల్‌: ప్రాక్టీస్‌లో ఇరగదీసిన ధోని, రైనా..‌

మరిన్ని వార్తలు