ఐపీఎల్‌లో నా ఫెవరెట్‌ టీమ్‌ అదే: రష్మిక

30 Apr, 2021 22:49 IST|Sakshi

బెంగళూరు: ఆర్‌సీబీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా టైటిల్‌ కొట్టలేకపోయింది. అయినా సరే ఆర్‌సీబీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చాలా ఎక్కువ. సాధారణ అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు ఆర్‌సీబీ ఆటను మెచ్చకుంటారు. తాజాగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ లిస్టులో చేరిపోయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.

విషయంలోకి వెళితే.. కరోనా ఉదృతమవుతున్న వేళ సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ పడడంతో సినీ తారలంతా ఇంటి పట్టునే ఉండి ఏదో ఒక పని చేసుకుంటూ గడిపేస్తున్నారు. తాజాగా రష్మిక కూడా తనకిష్టమైన వాటితో పాటు పర్సనల్‌.. చిన్ననాటి విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. ఈ సందర్భంగా ఒక అభిమాని ఆమెను ఐపీఎల్‌లో మీ ఫెవరెట్‌ టీమ్‌ ఏది అని అడిగాడు. దానికి రష్మిక.. 'ఈ సాలా కప్‌ నమ్‌దే' అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఆర్‌సీబీ తన ఫెవరెట్‌ అని చెప్పింది. 'ఈ సాలా కప్‌ నమ్‌దే' అనేది ఆర్‌సీబీ స్లోగన్‌.. యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్‌​ సీజన్‌కు ఈ స్లోగన్‌తో బరిలోకి దిగింది.  

అయితే గతేడాది ఫ్లేఆఫ్‌ వరకు వెళ్లి ఇంటి బాట పట్టింది. తాజాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ను మాత్రం ఆర్‌సీబీ ఘనంగానే ఆరంభించింది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు.. ఒక్క ఓటమితో మంచి ప్రదర్శనను కనబరిచింది. ప్రతీసారి టైటిల్‌ ఫెవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగే ఆర్‌సీబీ ఈసారైనా టైటిల్‌ సాధిస్తుందేమో చూడాలి. ఇక పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ చేధనలో తడబడుతుంది. పంజాబ్‌ బౌలర్ల దాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. ఆర్‌సీబీ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా పెవిలియన్‌ చేరడంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం కష్టమే.
చదవండి: పూరన్‌ చెత్త రికార్డు.. ఇంకా ఎందుకు ఆడిస్తున్నారు?

డేటింగ్‌ అంటే ఏంటో తెలీదంటున్న రష్మిక

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు