'నాన్న తొందరగా వచ్చేయ్‌.. నిన్ను మిస్సవుతున్నాం'

4 May, 2021 21:15 IST|Sakshi

న్యూఢిల్లీ: బీసీసీఐ ఎంతో ప్రతిష్మాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ కరోనా పుణ్యానా రద్దు చేయాల్సి వచ్చింది. సోమవారం కేకేఆర్‌ ఆటగాళ్లు ఇద్దరు కరోనా బారిన పడగా.. మంగళవారం మరో ఇద్దరికి పాజిటివ్‌ అని తేలడంతో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ఈ సీజన్‌ ఐపీఎల్‌ను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయం పక్కనపెడితే ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ సీజన్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఏడు మ్యాచ్‌లాడి ఆరు మ్యాచ్‌ల్లో ఓడి.. ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి కేన్‌ విలియమ్సన్‌కు బాధ్యతలు అ‍ప్పగించారు. వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సోషల్‌ మీడియాలో ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్‌పై దుమ్మెత్తిపోశారు. అయితే ప్రస్తుతం ఐపీఎల్‌ టోర్నీ రద్దు కావడంతో విదేశీ ఆటగాళ్లంతా ఎవరి దేశానికి వారు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో డేవిడ్‌ వార్నర్‌కు తన ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో వార్నర్‌ తన ఫ్యామిలీతో కలిసి టిక్‌టాక్‌ వీడియోలతో అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా వార్నర్‌ కూతుర్లు ఇవీ, ఇండీ, ఇస్లాలు తన తండ్రిని మిస్‌ అవుతూ గీసిన ఒక డ్రాయింగ్‌ వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన దానిని వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ప్లీజ్‌ డాడీ.. ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేయ్‌.. నిన్ను చాలా మిస్సవుతున్నాం.. లవ్‌ యూ డాడీ.. ఫ్రమ్‌ ఇండీ, ఇవీ, ఇస్లా.. అంటూ క్యాప్షన్‌ జత చేశారు. అయితే ఈ డ్రాయింగ్‌ను ఇవీ గీసిందని.. వార్నర్‌ చెప్పుకొచ్చాడు.  
చదవండి: 'మీ అభిమానానికి థ్యాంక్స్‌.. జడేజా అని పిలిస్తే చాలు'

'ఐపీఎల్‌ రద్దు అని తెలియగానే నా గుండె పగిలింది'

A post shared by David Warner (@davidwarner31)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు