'బడ్డీ.. ఎందుకంత కోపం! ఆ నవ్వు ఎక్కడ'

8 Apr, 2021 15:20 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లు అజింక్య రహానే, రవిచంద్రన్‌ అశ్విన్‌లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న వీరిద్దరు దానిని ముగించుకొని జట్టుతో కలవనున్నారు. ఈ నేపథ్యంలో అజింక్యా రహానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో టిప్‌టాప్‌గా తయారై సీరియస్‌ లుక్‌లో ఉన్న ఒక పాత ఫోటోను షేర్‌ చేశాడు. దీనిపై అశ్విన్‌ వినూత్న రీతిలో స్పందించాడు.


''ఏంటి బడ్డీ మరీ అంత సీరియస్‌గా ఉన్నావు. ఆ మిలియన్‌ డాలర్‌ స్మైల్‌ ఎక్కడ'?' అంటూ కామెంట్‌ చేశాడు. దీనిపై రహానే కూడా అదే రీతిలో రిప్లై ఇచ్చాడు. ''ఆ నవ్వు అనేది నీతో కలిసి బయోబబుల్‌లో కలిసి జాయిన్‌ అయినప్పుడు ఆటోమెటిక్‌గా వస్తుంది'' అంటూ తెలిపాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ గత రెండేళ్లుగా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తుంది. ముఖ్యంగా గతేడాది సీజన్‌లో అయ్యర్‌ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ అంచనాలకు మించి రాణించింది. ముంబైతో జరిగిన ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 10న ముంబై వేదికగా సీఎస్‌కేతో తలపడనుంది.
చదవండి: అరె వికెట్లకు అడ్డుగా నిలబడ్డాడు.. అవుట్‌ అయ్యాడు!

'గేల్‌ ఫిట్‌నెస్‌లో నాకు సగం వచ్చినా బాగుండు'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు