యాక్షన్‌లోకి నోర్జే.. విశ్రాంతి ఎవరికి?

16 Apr, 2021 16:34 IST|Sakshi
Photo Courtesy: BCCI/IPL

ముంబై:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకూ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన రెండు మ్యాచ్‌లకు దూరమైన దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ అన్రిచ్‌ నోర్జే.. మూడో మ్యాచ్‌కు సిద్ధమైపోయాడు. కగిసో రబడాతో కలిసి ఒకే విమానంలో భారత్‌కు వచ్చిన నోర్జే.. పంజాబ్‌ కింగ్స్‌తో ఆదివారం జరుగనున్న మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాడు. దీనిలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ బబుల్‌లో జాయిన్‌ అయ్యాడు.

ఢిల్లీ ఆటగాళ్లతో కలిసి నోర్జే ప్రాక్టీస్‌ చేస్తున్న విషయాన్ని సదరు ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. కాగా, అంతకుముందు నోర్జేకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని వార్తలను సదరు ఫ్రాంచైజీ ఖండించింది. నోర్జేకు కరోనా సోకలేదని, కాగా, ఇప్పుడు మూడుసార్లు కరోనా టెస్టులు చేసి నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిన తర్వాత మాత్రమే అతను జట్టుతో జాయిన్‌ అయ్యాడని తెలిపింది. నోర్జే రాకతో ఢిల్లీ బౌలింగ్‌ మరితం పెరిగింది. ఢిల్లీకి ప్రధాన బౌలింగ్‌ ఆయుధమైన నోర్జే.. కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు.

గత సీజన్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లను తన పేస్‌, వేగంతో హడలెత్తించిన నోర్జే జట్టుతో కలవడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ శిబిరంలో ఆనందం వ్యక్తమవుతోంది. కాగా,   వచ్చే మ్యాచ్‌లో నోర్జేను తుది జట్టులోకి తీసుకునే పక్షంలో ఎవరికి విశ్రాంతి ఇవ్వాలనే సమాలోచనలు చేస్తోంది ఢిల్లీ. కేవలం నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రం ఉండాలనే నిబంధనతో స్టోయినిస్‌, రబడా, క్రిస్‌ వోక్స్‌, టామ్‌ కరాన్‌లలోని ఒకరిని కచ్చితంగా తప్పించాలి. ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే క్రిస్‌ వోక్స్‌ అద్భుతమైన  బౌలింగ్‌తో చెలరేగుతున్నాడు. రబడాకు ఢిల్లీ ప్రధాన బౌలరే. ఇక స్టోయినిస్‌ ఆల్‌రౌండర్‌. దాంతో టామ్‌ కరాన్‌ను తప్పించే నోర్జేను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

ఇక్కడ చదవండి: 'అప్పటి ధోనివి కాదు.. బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్చుకో'
ఐపీఎల్‌ 2021: ఆరుగురు భారత క్రికెటర్లు.. ఒక్కడే విదేశీ క్రికెటర్‌

మరిన్ని వార్తలు