జాన్సెన్‌ ట్విన్స్‌తో అర్జున్‌ టెండూల్కర్‌

24 Apr, 2021 15:44 IST|Sakshi
Photo Courtesy: Instagram

చెన్నై:  దక్షిణాఫ్రికా బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సెన్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌  తరఫున అరంగేట్రం చేసిన మార్కో జాన్సెన్‌-అతని ట్విన్‌ బ్రదర్‌ డ్యుయాన్‌ జాన్సెన్‌ తో కలిసి దిగిన ఫోటోను అర్జున్‌ టెండూల్కర్‌ షేర్‌ చేశాడు. ఈ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో అర్జున్‌ పోస్ట్‌ చేశాడు. ముంబై ఇండియన్స్‌ క్యాంప్‌లో ఉన్న వీరు ముగ్గురు ఫోటో  దిగగా, దాన్ని అర్జున్‌ అభిమానులతో పంచుకున్నాడు. ఈ సీజన్‌లో అర్జున్‌ టెండూల్కర్‌ను ముంబై ఫ్రాంచైజీ తీసుకున్నా ఇంకా అరంగేట్రం చేయలేదు.

ముంబై  జట్టు సభ్యులతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. లెఫ్టార్మ్‌ మీడియం ఫాస్ట్‌ బౌలర్‌ అయిన అర్జున్‌.. ముంబై బ్యాటర్స్‌కు బౌలింగ్‌ చేస్తూ బిజిబిజీగా ఉన్నాడు.  సచిన్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్న అంబానీ గ్రూపు ఆధ్వర్యంలోని ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌ అర్జున్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరతో ఫిబ్రవరిలో జరిగిన వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు సొంతం చేసుకుంది. ఇక ఈ సీజన్‌లో మార్కో జాన్సెన్‌ ముంబై తరఫున రెండు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు సాధించాడు. ఇక్కడ 7.50  ఎకానమీ నమోదు చేశాడు. 


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు