ఐపీఎల్‌ 2021: మీకేమీ ప్రత్యేక ఏర్పాట్లు చేయలేం

27 Apr, 2021 15:04 IST|Sakshi

కాన్‌బెర్రా: ఐపీఎల్‌ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లను స్వదేశానికి తీసుకెళ్లేందుకు చార్టర్‌ విమానం వేయాలని కోరిన ఆ దేశానికి చెందిన క్రిస్‌ లిన్‌ విజ్ఞప్తికి చుక్కెదురైంది. ఈ విషయంలో తాము ఎటువంటి సాయం చేయలేమని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ తెగేసి చెప్పారు. ఐపీఎల్‌లో ఆడిన క్రికెటర్లంతా ప్రైవేట్‌గా ప్రయాణించారని, ఇదేమే ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు పర్యటనలో భాగంగా కాదన్నారు. అందుచేత ఆసీస్‌ క్రికెటర్లను తిరిగి స్వదేశానికి చేర్చేక్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేమన్నారు.  

ఆసీస్‌ క్రికెటర్ల కోసం ఏమైనా స్పెషల్‌ ఏర్పాట్లు చేస్తారా అనే ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. న్యూస్‌ ఏజెన్సీ ఏఎఫ్‌పీతో మాట్లాడిన మోరిసన్‌.. తాము ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదని కుండబద్దలు కొట్టారు. ‘ వారు(ఆసీస్‌ క్రికెటర్లు) ప్రైవేట్‌గా భారత్‌కు వెళ్లారు. ఆస్ట్రేలియా పర్యటనలో వారేమీ భారత్‌కు వెళ్లలేదు. వారికి తిరిగి రావడానికి వారుకున్న మౌలిక వసతులను ఉపయోగించుకునే రావాలి. ఇక్కడ వారే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. నేను వారిని కోరేది ఒక్కటే.... వారు సొంత ఏర్పాట్లు చేసుకుని రావాలనే ఆఖరిగా చెబుతున్నా’ అని తెలిపారు. 

ఇక్కడ చదవండి: మాకు చార‍్టర్‌ విమానం వేయండి: సీఏకు లిన్‌ విజ్ఞప్తి
ఇంత ఖర్చుతో ఐపీఎల్‌ అవసరమా?: రాజస్థాన్‌ ఆటగాడు

మరిన్ని వార్తలు