‘ధోని కోసం పంత్‌తో కలిసి ప్లాన్‌ చేశా’

10 May, 2021 18:37 IST|Sakshi

న్యూఢిల్లీ: అవేశ్‌ ఖాన్‌.. ఐపీఎల్‌-14 సీజన్‌లో అందర్నీ ఆకర్షించిన బౌలర్‌. మధ్యప్రదేశ్‌కు ఈ చెందిన ఈ పేస్‌బౌలర్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్‌లో అవేశ్‌ ఖాన్‌ 8 మ్యాచ్‌లాడి 14 వికెట్లు సాధించాడు. ఐపీఎల్‌ అర్థాంతరంగా నిరవధిక వాయిదా పడే సమయానికి అత్యధిక వికెట్ల జాబితాలో అవేశ్‌ ఖాన్‌ టాప్‌-2లో ఉన్నాడు.  ఈ సీజన్‌లో 30 ఓవర్లు బౌలింగ్‌ వేసిన అవేశ్‌ ఖాన్‌ యావరేజ్‌ 16.50గా ఉండగా, ఎకానమీ 7.70గా నమోదైంది. కాగా, ఈ సీజన్‌లో సీఎస్‌కేతో జరిగిన రెండో మ్యాచ్‌లో ధోనిని అవేశ్‌ బౌల్డ్‌ చేయడం, అందులోనూ రెండో బంతికే పెవిలియన్‌కు పంపడం విశేషం.

అయితే ధోని కోసం ప్రత్యేకంగా వ్యూహ రచన చేసే ఔట్‌ చేసిన విషయాన్ని అవేశ్‌ తాజాగా రివీల్‌ చేశాడు. అది కూడా తమ జట్టు కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ కలిసి ప్లాన్‌ చేసినట్లు తెలిపాడు.  జాతీయ దినపత్రిక ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన అవేశ్‌.. పలు విషయాల్ని షేర్‌ చేసుకున్నాడు.అందులో ధోని ఔట్‌ కోసం కూడా వెల్లడించాడు. ‘ ధోని క్రీజ్‌లోకి వచ్చే సమయానికి కొన్ని ఓవర్లు మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో ధోని హిట్‌ చేస్తాడనే విషయం పంత్‌కు తెలుసు. కానీ నాలుగు నెలల గ్యాప్‌ తర్వాత ధోని ఆడుతున్నాడు కాబట్టి హిట్‌ చేయడం కూడా కష్టమనే విషయం పంత్‌తో  పాటు నాకు కూడా తెలుసు.

ఆ సమయంలో పంత్‌ నాకు ఒకటే చెప్పాడు. బంతిని షార్ట్‌ ఆఫ్‌ లెంగ్త్‌లో వేయమన్నాడు. నేను అదే చేశాడు ధోని హిట్‌ చేయడానికి యత్నించాడు. కానీ అది ఎడ్జ్‌ తీసుకుని ధోని బౌల్డ్‌ అయ్యాడు’ అని అవేశ్‌ పేర్కొన్నాడు. తాను బౌలింగ్‌ రనప్‌ తీసుకునే సమయంలో పంత్‌ వైపు చూస్తానన్నాడు. అప్పుడు బ్యాట్స్‌మన్‌ తనవైపు చూస్తాడు కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదన్నాడు. యార్కర్ల విషయంలో​ కూడా పంత్‌ చేసే సంజ్ఞలతోనే జరుగుతుందన్నాడు. అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ బంతుల్ని కూడా ఇలానే వేస్తానన్నాడు. పంత్‌ సంకేతాలు తనకు తెలుసని ఈ సందర్భంగా అవేశ్‌ఖాన్‌ పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు