ఢిల్లీతో అక్షర్‌ పటేల్‌.. ఆ నవ్వే ఓ కథ అంటోన్న ఫ్రాంచైజీ

23 Apr, 2021 17:10 IST|Sakshi
Photo Courtesy:Twitter

అక్షర్‌ పటేల్‌ వచ్చేశాడు..

చెన్నై:  ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభానికి ముందు  కరోనా వైరస్‌ బారిన పడ్డ ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ కోలుకున్నాడు. ఈ నెల తొలి వారంలో అక్షర్‌కు కరోనా సోకగా అప్పట్నుంచీ క్వారంటైన్‌లో ఉన్నాడు. అతనికి తాజాగా నిర్వహించిన కోవిడ్‌ టెస్టులో నెగిటివ్‌ రావడంతో అక్షర్‌ జట్టుతో కలవడానికి మార్గం సగుమం అయ్యింది. జట్టుతో కలిసిన విషయాన్ని శుక్రవారం డీసీ తన ట్వీటర్‌ అకౌంట్‌ ద్వారా స్పష్టం చేసింది. అక్షర్‌ నవ్వుతున్న ఫోటోను పోస్ట్‌ చేసిన డీసీ..  ఆ నవ్వే ఒక కథను తెలియజేస్తుంది అని క్యాప్షన్‌ ఇచ్చింది.అక్షర్‌ పునరాగమనాన్ని డీసీ ఘనంగా స్వాగతించింది. 

అక్షర్‌ రాకతో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్‌ విభాగం మరింత పటిష్టం కానుంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌కు ముందు ఇంగ్లండ్‌తో రాణించిన ద్వైపాక్షిక సిరీస్‌లో అక్షర్‌ విశేషంగా రాణించాడు. తన స్పిన్‌ మాయజాలంతో ప్రత్యర్థి ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించాడు. తద్వారా భారత జట్టుకు అక్షర్‌ ఒక ప్రధాన స్పిన్నర్‌గా మారిపోయాడు.  ప్రస్తుతం ఐపీఎల్‌లో నాలుగు మ్యాచ్‌లకు గాను మూడింట విజయాలు నమోదు చేసిన ఢిల్లీ.. అక్షర్‌ మరిన్ని విజయాలు అందిస్తాడని ఆశిస్తోంది. అక్షర్‌కు కోవిడ్‌ సోకిన తర్వాత అతని స్థానంలో మహారాష్ట్రకు చెందిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షామ్స​  ములానిని తాత్కాలికంగా జట్టులోకి తీసుకున్నారు. మంగళవారం చెపాక్‌ మైదానంలో  ఆర్సీబీతో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. 

మరిన్ని వార్తలు