IPL‌ 2021: మూడోసారి తప్పుచేస్తే మ్యాచ్‌ నిషేధం

31 Mar, 2021 12:20 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌కు సంబంధించి బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. సాఫ్ట్‌ సిగ్నల్‌ తొలగింపు, షార్ట్‌ రన్‌పై థర్ఢ్‌ అంపైర్‌ కన్ను, 90 నిమిషాల్లోనే ఒక ఇన్నింగ్స్‌ పూర్తి చేయడం( 20 ఓవర్లు) లాంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రూల్స్‌ అన్ని ఈ సీజన్‌ ప్రారంభం నుంచే అమల్లోకి రానున్నాయి. తాజాగా బీసీసీఐ మరో కీలక ప్రతిపాధనతో ముందుకొచ్చింది.

స్లో ఓవర్‌రేట్‌ కారణంగా కొన్ని మ్యాచ్‌లు అనుకున్న సమయం కంటే ఎక్కువసేపు జరుగుతున్నాయి. దీంతో స్లో ఓవర్‌రేట్ నమోదు చేసే ఆయా జట్లకు బీసీసీఐ దండిగానే జరిమానా విధించనుంది. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఒకజట్టు మొదటిసారి స్లోఓవర్‌ రేటు నమోదు చేస్తే సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించనుంది. రెండోసారి అదే తప్పు చేస్తే.. కెప్టెన్‌కు రూ. 24 లక్షల జరిమానాతో​ పాటు జట్టులోని సభ్యులందరి నుంచి ఫీజులో రూ. 6 లక్షలు లేదా 25 శాతం కోత విధించడం జరుగుతుంది. అయితే ఇక్కడ కెప్టెన్‌కు మినహాయింపు ఉంటుంది.  

ఇక మూడోసారి అదే తప్పు రిపీట్‌ అయితే మాత్రం కెప్టెన్‌కు రూ .30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్‌ ఆడకుండా నిషేదం పడనుంది. దీంతో పాటు జట్టు సభ్యులందరి మ్యాచ్‌ ఫీజులోంచి రూ. 12 లక్షలు లేదా 50శాతం కోత విధించనున్నారు. దీని నుంచి కూడా కెప్టెన్‌కు మినహాయింపు ఉంటుంది. కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఏప్రిల్‌ 9న ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఆరంభం కానుంది.
చదవండి: 
ఐపీఎల్‌ 2021: వైఫై అస్సలు బాలేదు.. సాయం చేయండి

పంజాబ్‌ కింగ్స్‌ కొత్త జెర్సీ.. వారిని కాపీ కొట్టిందా!

మరిన్ని వార్తలు