ఒకే వేదికలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు..!

4 May, 2021 10:29 IST|Sakshi
Photo Courtesy: BCCI/Instagram

ముంబై:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల)-14 సీజన్‌కు కరోనా సెగ తగలడంతో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) సుదీర్ఘమైన చర్చలు జరుపుతోంది. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఐపీఎల్‌ను రద్దు చేయాలనే వాదన తెరపైకి రావడంతో బీసీసీఐ కచ్చితంతా జరిపి తీరుతామని స్పష్టం చేసింది. దీనిలో భాగంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. మిగిలిన ఐపీఎల్‌ సీజన్‌ను ఒకే వేదికలో జరిపితే ఎలా ఉంటుందనే దానిపై చర్చిస్తోంది.  ఇందుకు ముంబైను వేదికగా ఎంచుకోవాలని చూస్తోంది.

ముంబైలో మూడు క్రికెట్‌  స్టేడియాలు ఉండటంతో వాటిలోనే మిగిలిన సీజన్‌ను జరపాలని భావిస్తోంది. ఆర్సీబీ-కేకేఆర్‌ జట్ల మధ్య అహ్మదాబాద్‌ వేదికగా నిన్న జరగాల్సిన మ్యాచ్‌ రీషెడ్యూల్‌ చేయబడటంతో ఇక మిగతా మ్యాచ్‌లకు ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే చూస్తోంది. దాంతో ఒకే వేదికలో మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ముంబైలోని స్టేడియాలకు సమీపంలో ఉన్న హోటళ్లతో సంప‍్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ అహ్మదాబాద్‌-ఢిల్లీ- ముంబై, చెన్నైల్లో తొలి అంచె మ్యాచ్‌లు పూర్తి కాగా, రెండో అంచెలో బెంగళూరు, కోల్‌కతా కూడా ఉన్నాయి. ఇన్ని స్టేడియాల్లో బయోబబుల్‌లో మ్యాచ్‌లు నిర్వహించే కంటే ముంబైలో ఉన్న మూడు క్రికెట్‌ స్టేడియాల్లో మిగిలిన సీజన్‌ జరపడంపై ఫోకస్‌ పెట్టింది. ముంబై నగరం ఒకటే భారత్‌లో మూడు అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాలు ఉన్న సిటీ కాబట్టి ఇదే సరైనదిగా బీసీసీఐ యోచిస్తోంది. బాంబే జింఖానా గ్రౌండ్‌, బ్రబోర్న్‌ స్టేడియం, వాంఖడే స్టేడియాలు ముంబైలో ఉన్నాయి. 

ఇక్కడ చదవండి: KL Rahul: కేఎల్‌ రాహుల్‌కు శస్త్ర చికిత్స
విరాళంపై రూటు మార్చిన కమిన్స్‌!

మరిన్ని వార్తలు