పుల్‌ షాట్‌ మాస్టర్‌కు హ్యాపీ బర్త్‌డే..!

30 Apr, 2021 15:11 IST|Sakshi
Photo Courtesy: Instagram

ఢిల్లీ:  టీమిండియా ఓపెనర్‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 34వ బర్త్‌డే సందర్భంగా అతనికి అభినందనల వర్షం కురుస్తోంది. భారత్‌ క్రికెట్‌లో ఓపెనర్‌గా ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న రోహిత్‌ శర్మ..అటు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా కూడా సక్సెస్‌ అయ్యాడు. ఇప్పటివరకూ ఐదు టైటిల్స్‌ను తన సారథ్యంలో సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు రోహిత్‌.  ముంబై  ఇండియన్స్‌ను విజయవంతం చేయడంలో అటు బ్యాట్స్‌మన్‌గా ఇటు కెప్టెన్‌గా తనవంతు పాత్ర పోషిస్తున్న హిట్‌మ్యాన్‌ రోహిత్‌ జన్మదినం సందర్భంగా పలువురు క్రికెటర్లు,  అభిమానులు పెద్ద సంఖ్యలో అతనికి విషెస్‌ తెలియజేస్తున్నారు. 

భార్య రితికాతో కలిసి రోహిత్‌ శర్మ తన బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడు. దీనిలో భాగంగా రితికా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో రోహిత్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వరల్డ్‌​ ఈజ్‌ ఏ బెటర్‌ ప్లేస్‌ విత్‌ యూ. హ్యాపీ బర్త్‌డే రో. నువ్వు మాకు దొరకడం ఎప్పటికీ గొప్పగా ఉంటుంది’ అని కూతురు సమైరాతో రోహిత్‌ ఉన్న ఫోటోను షేర్‌ చేశారు రితికా. ‘ అతని నడిచే ప్రతీ వేదిక ఫైర్‌గానే ఉంటుంది. అతని పేరే రో-హిట్‌’ అని ముంబై ఇండియన్స్‌ విష్‌ చేసింది. ‘ హ్యాపీ బర్త్‌ డే మాస్టర్‌ ఆఫ్‌ ద పుల్‌ షాట్‌’ అని ఐసీసీ ట్వీట్‌ చేసింది. ఇక వృద్ధిమాన్‌ సాహా, కృనాల్‌ పాండ్యా, శ్రేయస్‌ అయ్యర్‌, సురేశ్‌ రైనా తదితరులు కూడా రోహిత్‌కు విషెస్‌ తెలిపిన  వారిలో ఉన్నారు. ఇక రోహిత్‌ అభిమానులు కూడా సోషల్‌ మీడియాలో విషెస్‌ తెలుపుతున్నారు. కాగా, ఈ ఐపీఎల్‌ సీజన్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లాడి మూడు గెలిచింది. 

A post shared by Ritika Sajdeh (@ritssajdeh)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు