'ఇకపై ఏం చేసినా మరింత స్ట్రాంగ్‌గా ఉండాలి' 

27 Apr, 2021 19:28 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కేకేఆర్‌ నాలుగు పరాజయాల తర్వాత సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్‌ 16.4 ఓవర్లలోనే చేధించింది. మోర్గాన్‌ 47 పరుగులు నాటౌట్‌ చివరివరకు నిలిచి జట్టును గెలిపించాడు. ఇక కేకేఆర్‌ తన తర్వాతి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 29న అహ్మదాబాద్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌తో మ్యాచ్‌ ముగిసిన తర్వాత కేకేఆర్‌ హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ ఇచ్చిన స్పీచ్‌ వైరల్‌గా మారింది.

'' ఈరోజు మ్యాచ్‌లో మీరు చూపిన ఆట అద్భుతం. మొదట బౌలింగ్‌ టీంను అభినందించాలి. ఆ తర్వాత ఫీల్డింగ్లో కూడా మెరవడం మనకు కలిసొచ్చింది. అయితే బ్యాటింగ్‌ విషయానికి వచ్చేసరికి 20 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయాం. ఆ సమయంలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందనుకున్నా.. కానీ మోర్గాన్‌, రాహుల్‌ త్రిపాఠిల కౌంటర​ అటాక్‌ సూపర్‌.. దీనిని రానున్న మ్యాచ్‌ల్లో కొనసాగించాలి.

గేమ్‌ ఆడితే ఫోకస్‌ చాలా కీలకం. అది మనకు ఎవరు చెప్పరు.. ఆట ఆడేటప్పుడు మనకు ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకొని నిలబడి ఆడాలి. మోర్గాన్‌, త్రిపాఠిలు అదే చేసి చూపించారు. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత విక్టరీ సాధించాం. దీనికి ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఈ విజయంతో మీకు కాన్ఫిడెంట్‌ పెరిగిందని అనుకుంటున్నా. ఇకపై ఏం చేసినా మరింత స్ట్రాంగ్‌గా ఉండాలనేది నా నిర్ణయం అంటూ'' చెప్పుకొచ్చాడు.  మెక్‌కల్లమ్‌ స్పీచ్‌ను కేకేఆర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. కాగా పంజాబ్‌ కింగ్స్‌పై విజయంతో కేకేఆర్‌ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది.
చదవండి: దృష్టం బాగుండి ఆ బ్యాట్‌ ఎవరిపై పడలేదు

బయట భయంకర పరిస్థితులే ఉన్నాయి: మోర్గాన్‌

A post shared by Kolkata Knight Riders (@kkriders)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు