బ్రెట్‌ లీ ఔదార్యం.. 1 బిట్‌కాయిన్ విరాళం

27 Apr, 2021 19:10 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న భారత్‌కు తన వంతు సాయం చేయడానికి ఆసీస్‌ మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ ముందుకొచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో భాగంగా బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌స్పోర్ట్స్‌కు ప్రెజంటర్‌గా వ్యవహరిస్తూ భారత్‌లో ఉన్న బ్రెట్‌ లీ.. మంగళవారం 1 బిట్‌కాయిన్‌ను విరాళంగా అందించనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో భారత్‌పై ఉన్న అభిమానాన్ని తన పోస్ట్‌ ద్వారా చాటుకున్నాడు. 

‘నాకు భారత్‌ రెండో మాతృదేశంతో సమానం. ఈ దేశంలో ప్రజల ప్రేమను చాలా ఎక్కువగా పొందాను. నాకు భారత్‌తో ఒక బంధం ఉందనే అనుకుంటా.  నా ప్రొఫెషనల్‌ కెరీర్‌లో కానీ రిటైర్మెంట్‌ తర్వాత కానీ భారత్‌ నాకు ఒక ప్రత్యేకమైన ప్లేస్‌గా భావిస్తున్నా. కరోనా మహమ్మారితో తల్లడిల్లిపోతున్న ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి.

భారత్‌లో హాస్పిటల్స్‌లో ఆక్సిజన్‌ సరఫరా వినియోగానికి నా వంతు సాయంగా 1 బిట్‌ కాయిన్‌ను విరాళంగా ఇస్తున్నా’ అని తెలిపాడు. ప్రస్తుతం బిట్‌కాయిన్‌ విలువ భారత్‌ కరెన్సీలో సుమారు రూ. 40లక్షలుగా ఉంది. సోమవారం కేకేఆర్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ 50 వేల డాలర్లను పీఎం కేర్స్‌ఫండ్‌కు సాయాన్ని ప్రకటించారు. అంతేకాదు మిగతా ఐపీఎల్‌ సభ్యులు కూడా స్పందించాలని కోరారు. కరోనా విజృంభణతో  ఆక్సిజన్‌ నిల్వల తీవ్ర కొరత నేపథ్యంలో కమిన్స్‌ సాయం చేయడానికి తొలి అడుగువేశాడు. 

A post shared by Brett Lee (@brettlee_58)

మరిన్ని వార్తలు