'ఆ చిన్న లోపాలు సరిచేసుకో.. మిగతాదంతా సూపర్'‌

17 Apr, 2021 16:24 IST|Sakshi

ముంబై: ఆర్‌సీబీ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఆ జట్టు తరపున టాప్‌ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 15 మ్యాచ్‌లాడిన పడిక్కల్‌ 473 పరుగులు సాధించగా.. ఇందులో ఐదు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. తాజాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ముంబైతో మ్యాచ్‌కు ముందు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఐసోలేషనలో ఉన్న అతన్ను ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చిన పడిక్కల్‌ 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.

ఈ నేపథ్యంలో విండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా పడిక్కల్‌ ఆటతీరుపై కీలకవ్యాఖ్యలు చేశాడు.''పడిక్కల్‌లో మంచి టాలెంట్‌ దాగుంది. గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఐదు హాఫ్‌ సెంచరీలు సాధించి ఆర్‌సీబీ తరపున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతేగాక గత ఐదు నెలలుగా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న పడిక్కల్‌ విజయ్‌ హజారే ట్రోపీలో 700 పరుగులకు పైగా సాధించాడు. అతని బ్యాటింగ్‌లో ఉన్న చిన్న పొరపాట్లను సరిచేసుకుంటే ఈ సీజన్‌లో సెంచరీ మార్క్‌ సహా పలు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు గెలుచుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి'' అని చెప్పుకొచ్చాడు. కాగా ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను చెన్నై వేదికగా రేపు కేకేఆర్‌తో తలపడనుంది. 
చదవండి: చిన్న పిల్లాడిలా కోహ్లి.. ఏబీ, చహల్‌ మాత్రం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు