బుమ్రా-సంజనాల ‘వన్‌ మంత్‌ ఆఫ్‌ లవ్’‌ సెలబ్రేషన్స్‌

15 Apr, 2021 19:36 IST|Sakshi
Photo Courtesy: Bumrah's Twitter

ముంబై:   గత నెల 14వ తేదీన గోవాలో స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజనా గణేశన్‌- టీమిండియా పేసర్‌ బుమ్రాలు  అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరు అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానుల్ని పలకరిస్తూనే ఉన్నారు. తమ ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ వారి అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు. తాజాగా సంజనాతోపెళ్లి జరిగి నెల అయిన సందర్భంగా సెలబ్రేట్‌ చేసుకున్న వవిషయాన్ని బుమ్రా తన ట్వీటర్‌ అకౌంట్‌ ద్వారా స్పష్టం చేశాడు. ఒక నెల ప్రేమలో ఎన్నో జ్ఙాపకాలు  అంటూ ట్వీటర్‌ లో షేర్‌ చేశాడు. ‘కడుపుబ్బా నవ్వులు.. సిల్లీ జోక్స్‌,  సుదీర్ఘమైన చర‍్చలు.. శాంతి. ఇవి నా బెస్ట్‌ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత మా నెల ప్రేమలో ముచ్చట్లు ’ అని బుమ్రా రాసుకొచ్చాడు. 

కాగా , కెరీర్‌ పరంగా టీమిండియా పేస్‌ దళానికి నాయకత్వం వహిస్తున్న 27 ఏళ్ల బుమ్రా... ఇప్పటి వరకు 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 83, వన్డేల్లో 108 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో 5 సార్లు టైటిల్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా మిస్‌ ఇండియా పోటీల్లో ఫైనలిస్టు అయిన సంజన, ఆ తర్వాత టీవీ ప్రజెంటర్‌గా అవతారమెత్తారు. ప్రపంచకప్‌, ఐపీఎల్‌ వంటి క్రికెట్‌ మెగా టోర్నీలు సహా ఇతర క్రీడలకు సంబంధించిన ఈవెంట్లలో భాగస్వామ్యమయ్యారు. బుమ్రాతో పెళ్లి తర్వాత భారత్‌-ఇంగ్లండ్‌తో సిరీస్‌లో సంజనా పాల్గొనగా, బుమ్రా విశ్రాంతి తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌తో బుమ్రా బిజీగా ఉ‍న్నాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు