ఐపీఎల్‌ 2021: వారిద్దరు ఎదురుపడితే ఆ మజానే వేరు

9 Apr, 2021 16:17 IST|Sakshi
ఫోటో కర్టసీ: బీసీసీఐ

చెన్నై: మరికొన్ని గంటల్లో డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ 14వ సీజన్‌కు తెరలేవనుంది. ఇన్నాళ్లు టీమిండియాకు కలిసి ఆడిన ఆటగాళ్లంతా ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ మిత్రులుగా ఉన్నవారు కాస్త శత్రువులుగా మారనున్నారు. అయితే ఐపీఎల్‌కు ముందు ఆసీస్‌, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లను కోహ్లి సారధ్యంలో టీమిండియా గెలుచుకోవడం.. మరోవైపు ఆసీస్‌ సిరీస్‌లో ఆడిన బుమ్రా పెళ్లి కారణాలతో ఇంగ్లండ్‌ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవలే స్పోర్ట్‌ జర్నలిస్ట్‌ సంజనా గణేషన్‌ను పెళ్లి చేసుకున్న బుమ్రా నూతనోత్సాహంతో ఐపీఎల్‌కు సిద్ధమయ్యాడు.

ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌ ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్‌కు జరగనుండడంతో కోహ్లి, బుమ్రాల పోటీ ఆసక్తికరంగా మారనుందంటూ ఆకాశ్‌చోప్రా పేర్కొన్నాడు.'' ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్న కోహ్లి ఓపెనర్‌గా.. ముంబై ఇండియన్స్‌ తరపున ఓపెనింగ్‌ బౌలర్‌గా జస్‌ప్రీత్‌ బుమ్రా మరోసారి ఎదురుపడితే చూడాలనుంది. బుమ్రా.. కోహ్లి వికెట్‌ తీస్తాడా.. లేక కోహ్లి బుమ్రాపై బౌండరీల వర్షం కురిపిస్తాడా అనేది చూడాలి. కోహ్లి బ్యాటింగ్‌ దెబ్బతీయడానికి ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బుమ్రాతో బౌన్సర్లు వేయించేందుకు సిద్ధంగా ఉంటాడు.'' అని చెప్పుకొచ్చాడు.

ఇక బుమ్రాకు ఐపీఎల్‌లో కోహ్లిపై ఒక అరుదైన రికార్డు ఉంది. బుమ్రాకు ఐపీఎల్‌లో మొయిడెన్‌ వికెట్‌(2013 ఐపీఎల్‌) కోహ్లి రూపంలో వచ్చింది. అలాగే ఐపీఎల్‌లో తన 100వ వికెట్‌(2020 ఐపీఎల్‌)ను కూడా కోహ్లి రూపంలోనే రావడం విశేషం. ఇక బుమ్రా తన ఐపీఎల్‌ కెరీర్‌లో 92 మ్యాచ్‌లాడి 109 వికెట్లు తీశాడు. ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్న కోహ్లి ఐపీఎల్‌లో 192 మ్యాచ్‌లాడి 5878 పరుగులు చేశాడు. 
చదవండి: కేవలం ఆ ఒక్క కారణం వల్ల ఆర్సీబీని వీడాలనుకోలేదు

ఫేస్‌ టు ఫేస్‌ ఫైట్‌లో ముంబైదే పైచేయి

మరిన్ని వార్తలు