అతను మీ గన్‌డెత్‌ బౌలర్‌ కాకపోవచ్చు.. కానీ

5 Apr, 2021 20:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎప్పటిలానే ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కూడా ఏ జట్లు కూర్పు ఎలా ఉండాలి అనే దానిపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా పలు సూచనలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల గురించి మాట్లాడిన చోప్రా.. కేకేఆర్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కమిన్స్‌ గన్‌ డెత్‌ బౌలర్‌ కాకపోయినా 15 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి కొనుగోలు చేసినందుకు అతన్ని సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఆ జట్టు మేనేజ్‌మెంట్‌దేనని పేర్కొన్నాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ చర‍్చలో కమిన్స్‌ గురించి మాట్లాడుతూ.. అతన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై కేకేఆర్‌ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నాడు. ‘ కమిన్స్‌ మీ గన్‌ డెత్‌ బౌలర్‌ కాకపోవచ్చు. కానీ 15 కోట్లు పెట్టి తీసుకున్నందుకు కచ్చితంగా  అతన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కేకేఆర్‌దే‌.  

కొత్త బంతితో కమిన్స్‌ ప్రమాదకారి అనే విషయం గ్రహించాలి. తొలి ఆరు ఓవర్లలోనే ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కకావికలం చేయాలంటే కమిన్స్‌ చేతికి కొత్త బంతిని ఇవ్వండి.  సాధ్యమైనంత వరకూ పవర్‌ ప్లేలోనే కమిన్స్‌కు ఎక్కువ ఓవర్లు ఇస్తే మంచిది.  డెత్‌ ఓవర్ల వచ్చే సరికి అతనికి ఎక్కువ ఓవర్లు ఉంచకండి.  కమిన్స్‌ పేస్‌, బౌన్స్‌తో పాటు బంతిని ఇరువైపులా స్వింగ్‌ చేయగలడు. కొత్త బంతి ద్వారా స్వింగ్‌ రాబట్టడం కష్టం కావచ్చు.. కానీ కమిన్స్‌కు కొత్త బంతిని స్వింగ్‌  చేసే సామర్థ్యం ఉంది. కమిన్స్‌ బ్యాటింగ్‌ కూడా చేయగలడు. బ్యాటింగ్‌లో కూడా కమిన్స్‌ను ప్రమోట్‌ చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఆండ్రీ రస్సెల్‌ పదే పదే విఫలమైతే ఆ స్థానంలో కమిన్స్‌ను పంపండి.  భారీ షాట్లు కొట్టే సామర్థ్యం కమిన్స్‌లో ఉంది. 2020 సీజన్‌లో కమిన్స్‌ బ్యాటింగ్‌  మెరుపులు చూశాం. ఈ సీజన్‌లో కమిన్స్‌ బ్యాటింగ్‌లో ఆకట్టుకుండానే అనుకుంటున్నా’ అని చోప్రా పేర్కొన్నాడు. ఏప్రిల్‌ 11వ తేదీన కేకేఆర్‌-సన్‌రైజర్స్‌ జట్ల మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఆయా జట్ల తొలి మ్యాచ్‌ జరుగనుంది. 

కేకేఆర్‌ స్క్వాడ్‌ ఇదే..

పృథ్వీషా ఆ అలవాటును మార్చుకోవాలి: పాంటింగ్‌

మరిన్ని వార్తలు