మొన్న మైఖేల్‌ జాక్సన్‌ ఇవాళ దలేర్‌ మెహందీ..

9 Apr, 2021 21:35 IST|Sakshi

ముంబై: ఇటీవలే క్వారంటైన్‌ను పూర్తి చేసుకొని జట్టుతో చేరిన పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు క్రిస్‌ గేల్..‌ ఓ పక్క ప్రాక్టీస్‌ చేస్తూనే రోజుకో కొత్త తరహాలో అభిమానులను అలరిస్తున్నాడు. మొన్న మైఖేల్‌ జాక్సన్‌ మూన్‌వాక్‌కు స్టెప్పులేసి ఇరగదీసిన యూనివర్సల్‌ బాస్‌.. తాజాగా పంజాబీ స్టార్‌ సింగర్‌ దలేర్‌ మెహందీ పాటకు డోల్‌ వాయిస్తూ అదరగొట్టాడు. 90 దశకంలో పాపులర్‌ అయిన తునుక్‌ తునుక్‌ సాంగ్‌కు తగట్టుగా డోల్‌ వాయిస్తూ, స్టెప్పులేస్తూ అభిమానులను హుషారెత్తించాడు. గేల్‌ పర్ఫామెన్స్‌కు సంబంధించిన వీడియోను పంజాబ్‌ యాజమాన్యం తమ ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేసింది.

A post shared by Punjab Kings (@punjabkingsipl)

గేల్‌ పంజాబీ ధమాకాకు ముగ్దులైన అభిమానులు ఈ పోస్ట్‌కు తెగ లైకులు కొడుతున్నారు. ఎంతగా అంటే పోస్ట్‌ చేసిన గంటలోనే 18000 లైక్‌లు కొట్టి గేల్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. గేల్‌ ఆన్‌ ఫీల్డ్‌ ఎంత హుషారుగా ఉంటాడో ఆఫ్‌ ఫీల్డ్‌ కూడా అంతే హుషారుగా ఉంటూ అభిమానులను సంతృప్తి పరుస్తుంటాడంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు విండీస్‌ దలేర్‌ మెహందీ అంటూ, గేల్‌ బనాయేగా బౌలర్స్‌కి రైల్‌ అంటూ సందేశాలు పంపారు.  ఇదిలా ఉండగా, గేల్‌ ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో మరోసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఏప్రిల్‌ 12న ముంబై వేదికగా జరిగే తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడేందుకు సిద్ధంగా ఉన్నాడు.
చదవండి: కొడితే సిక్సే.. సింగిల్స్‌ అసలు తీయరేమో

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు