మోర్గాన్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడా?

25 Apr, 2021 00:08 IST|Sakshi

ముంబై: గత ఐపీఎల్‌లో గుర్తుండే ఉంటుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన దినేశ్‌ కార్తీక్‌ అర్థాంతరంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇందులకు కారణం కార్తీక్‌పై వచ్చిన విమర్శలు.. ఇంగ్లండ్‌కు వరల్డ్‌ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్‌ను కేకేఆర్‌ జట్టులో ఉంచుకొని కార్తీక్‌కు కెప్టెన్సీ ఎందుకని ప్రశ్నించారు. దాంతో తనకు సారథ్యం వద్దని కార్తీక్‌ తప్పుకున్నాడు. దినేశ్‌ కార్తీక్‌ స్వయంగా తప్పుకున్నాడనే దానికంటే తప్పించారంటేనే సబబు.

ఆ రోజు కార్తీక్‌కు మేనేజ్‌మెంట్‌ అండ ఉంటే సారథ్య బాధ్యతల్ని వదులుకునే వాడు కాదు. అప్పుడు కేకేఆర్‌ యాజమాన్యం కార్తీక్‌ను అడిగి తర్వాత అతను తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మోర్గాన్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం, కార్తీక్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవని చెప్పడం చకచకా జరిగిపోయాయి. అంతే చకచకా కేకేఆర్‌ కథ లీగ్‌ దశలోనే ముగిసింది.

మరి ఈ సీజన్‌లో కేకేఆర్‌ ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతూ పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో కొనసాగుతోంది., దాంతో కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌కు చేరుతుందా అనే ప్రశ్న ఆ ఫ్రాంచైజీ అభిమానుల్లో మొదలైంది. అప్పుడు కార్తీక్‌ బ్యాటింగ్‌లో విఫలం అవుతున్నాడని అతను కెప్టెన్‌గా తప్పుకున్నాడని, ఇప్పుడు మోర్గాన్‌ కూడా జట్టుకు అద్భుత ఫలితాల్ని ఏమీ ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

బ్యాట్స్‌మన్‌గా కూడా మోర్గాన్‌ విఫలం  అవుతున్నాడని మరి కొత్త కెప్టెన్‌ కేకేఆర్‌ ట్రై చేస్తుందా అని అభిమానులు ప్రశ్నిస్తున్నాడు. ఐపీఎల్‌-14 సీజన్‌కు కామెంటేటర్లుగా పని చేస్తున్న మాజీలు కూడా ఇదే ప్రశ్న లేవదీయం గమనార్హం. రాజస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ దారుణంగా ఓడిపోయిన తర్వాత మోర్గాన్‌ సారథ్యాన్ని టార్గెట్‌ చేశారు.. కేకేఆర్‌తో  జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. రాజస్తాన్‌ బ్యాటింగ్‌లో సామ్సన్‌ 42 పరుగులతో రాణించగా..  మిల్లర్‌ 24 పరుగులు సాధించాడు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు