ఇంగ్లండ్‌ మహిళ క్రికెటర్‌కు సీఎస్‌కే గిఫ్ట్‌

5 May, 2021 16:52 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సీఎస్‌కే దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన సీఎస్‌కే ఈసారి మాత్రం దానికి భిన్నంగా రాణించింది. అయితే దురదృష్టవశాత్తు ఐపీఎల్‌కు కూడా కరోనా సెగ తగలడంతో బీసీసీఐ మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కోవిడ్‌ దృశ్యా సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ విషయం పక్కనబెడితే.. ఈ సీజన్‌లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న సీఎస్‌కే తన అభిమానికి జెర్సీని గిఫ్ట్‌గా పంపింది. అయితే ఆ అభిమాని ఎవరో కాదు.. ఇంగ్లండ్‌ మహిళ స్టార్‌ క్రికెటర్‌ కేట్‌ క్రాస్‌. సీఎస్‌కే అంటే విపరీతమైన అభిమానం చూపించే కేట్‌కు సీఎస్‌కే జెర్సీని పంపింది. అయితే సీఎస్‌కే జెర్సీని అందుకున్న కేట్‌ దానిని ధరించి తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.


''మీ అభిమానానికి థ్యాంక్స్‌ సీఎస్‌కే.. మీరు పంపిన జెర్సీని ఇప్పుడే వేసుకున్నా. సీఎస్‌కే జెర్సీపై 16 నెంబర్‌ కేటాయించడం నాకు సంతోషంగా అనిపించింది. కానీ కరోనా పరిస్థితుల దృశ్యా ఐపీఎల్‌ రద్దు కావడం బాధ కలిగించింది. అయితే బీసీసీఐ మంచి నిర్ణయమే తీసుకుంది. ఆట కంటే ముందు ప్రాణాలు ముఖ్యం.. పరిస్థితులు చక్కబడి మళ్లీ లీగ్‌ ఆరంభిస్తే చూడాలని ఉంది'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. కాగా సీఎస్‌కే జట్టులో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీకి కరోనా పాజిటివ్‌గా తేలగా.. తాజాగా ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ కూడా కరోనా బారీన పడినట్లు సీఎస్‌కే మంగళవారం రాత్రి ట్వీట్‌ చేసింది.
చదవండి: 'అక్కడ ప్రాణాలు పోతున్నాయి.. రద్దు చేయడం మంచిదే'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు