సీఎస్‌కేతో ఆసీస్‌ పేసర్‌ ఒప్పందం

9 Apr, 2021 14:47 IST|Sakshi
బెహ్రెన్‌డార్ఫ్‌(ఫైల్‌ఫోటో), ఫోటో కర్టసీ-ఐఏఎన్‌ఎస్‌

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌ ప్రారంభం కావడానికి కొన్ని రోజు ముందే ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు ఆసీస్‌ పేసర్‌ జోష్‌ హజల్‌వుడ్‌. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడాల్సి ఉన్న ఈ ఆటగాడు బయో బబుల్‌ నిబంధనలు కారణంగా ఐపీఎల్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.  సుదీర్ఘంగా బయోబబుల్‌లో ఉండడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హజల్‌వుడ్‌ తెలిపాడు. గత 10 నెలల నుంచి క్వారంటైన్‌, బయో బబుల్‌లో ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యామిలీకి దూరం కావాల్సి వస్తుందని, ఐపీఎల్‌తో అది ఇంకా కష్టంగా ఉంటుందని స్పష్టం చేసి మరీ ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు.  

కాగా, అతని స్థానంలో తాజాగా బెహ్రెన్‌డార్ఫ్‌ను సీఎస్‌కే తీసుకుంది. ఆస్ట్రేలియాకే చెందిన మరో పేసర్‌ బెహ్రెన్‌డార్ఫ్‌తో హజల్‌వుడ్‌ స్థానాన్ని భర్తీ చేయాలని భావించిన ఆ మేరకు ఒప్పందం చేసుకుంది.  ఇప్పటివరకూ 11 వన్డేలు, 7 అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం ఉన్న బెహ్రెన్‌డార్ఫ్‌.. గత రెండేళ్ల నుంచి జాతీయ జట్టుకు ఆడటం లేదు. ఇదిలా ఉంచితే, 2021 బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో పెర్త్‌ స్కాచర్స్‌కు ఆడిన బెహ్రెన్‌డార్ఫ్‌.. ఆ జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 2019 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ సీజన్‌లో ముంబై  తరఫున ఐదు వికెట్లు మాత్రమే సాధించి నిరాశపరిచాడు. ఇప్పుడు సీఎస్‌కే  ఆడి తన సత్తాను నిరూపించుకోవాలనుకుంటున్నాడు. శనివారం(ఏప్రిల్‌ 10వ తేదీన) సీఎస్‌​కే-ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ జరుగనుంది. 

ఇక్కడ చదవండి: అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం.. నాకు నమ్మకం ఉంది!

IPL 2021: ఈ ఆటగాళ్లకు ఇదే చివరి సీజన్‌ కాబోతోందా?!

>
మరిన్ని వార్తలు