అందమైన రాజస్థానీ రాయల్‌కు జన్మదిన శుభాకాంక్షలు..

20 Apr, 2021 19:28 IST|Sakshi

ముంబై: రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం తమ జట్టు ఆటగాడు జోస్‌ బట్లర్‌ కుమార్తెకు అదిరిపోయే రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. నేడు (ఏప్రిల్‌ 20న) రెండవ పుట్టిన రోజు జరుపుకుంటున్న బట్లర్‌ కుమార్తె జార్జియాకు ట్విటర్‌ వేదికగా విషెస్‌ తెలుపుతూ.. తండ్రి, కూతుళ్లకు చిరకాలం గుర్తుండిపోయే అపురూపమైన కానుకను అందజేసింది. తండ్రి బట్లర్‌ ఫోటోకు జార్జియా ఫోటోను జోడిస్తూ.. అందమైన రాజస్థానీ రాయల్‌కు రెండవ జన్మదిన శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్‌డే జార్జియా అంటూ క్యాప్షన్‌ జోడించింది. 

ఆర్‌ఆర్‌ యాజమాన్యం జార్జియాకు చెందిన రెండు అద్భుతమైన ఫోటోలను అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఓ ఫోటోలో జార్జియా క్రికెట్‌ గ్లవ్‌ను ధరించి, చిరునవ్వును ఒలకబోస్తుండగా, మరో ఫోటోలో బట్లర్‌ జార్జియాను గాల్లోకి ఎగరేస్తూ కనిపిస్తాడు. ఈ రెండు ఫోటోలకు పోస్ట్‌ చేసిన కొద్ది నిమిషాల్లోనే విపరీతమై స్పందన లభించింది. లక్షల సంఖ్యలో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ లైక్‌లు కొట్టారు. చిట్టి దేవతకు జన్మదిన శుభాకాంక్షలు.. స్టే బ్లెస్‌డ్‌ లిటిల్‌ ఛాంప్‌ అంటూ మెసేజ్‌లు పెట్టారు. 

ఇదిలా ఉంటే, సోమవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో ఘోరపరాభవాన్ని మూటగట్టుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌.. ఈ సీజన్‌లో రెండో పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో బట్లర్‌ ఒక్క పరుగు తేడాతో హాఫ్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ప్రస్తుత సీజన్‌లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన బట్లర్‌ మొదటి రెండు మ్యాచ్‌ల్లో(25, 2) తీవ్రంగా నిరాశపరిచి, మూడో మ్యాచ్‌లో(49) పర్వాలేదనిపించాడు. ఆర్‌ఆర్‌.. ఏప్రిల్‌ 22న జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు