David Warner: ఒక్క మ్యాచ్‌ మూడు రికార్డులు కొట్టిన వార్నర్‌

28 Apr, 2021 22:41 IST|Sakshi
Courtesy : IPL Twitter

ఢిల్లీ: సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ మూడు రికార్డులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్‌ హాఫ్‌ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. కాగా వార్నర్‌కు ఇది ఐపీఎల్‌లో 50వ అర్థశతకం కావడం విశేషం. ఇక సిక్స్‌తో హాఫ్‌ సెంచరీ సాధించిన వార్నర్‌కు ఐపీఎల్‌లో 200వ సిక్స్‌ కావడం విశేషం. ఐపీఎల్‌లో 200 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో వార్నర్‌ 8వ ఆటగాడిగా నిలిచాడు.

ఇక వార్నర్‌ 48 పరుగుల వద్ద ఉన్నప్పుడు మరో మైలురాయిని చేరుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 10వేల పరుగులు సాధించిన 4వ ఆటగాడిగా వార్నర్‌ చరిత్ర సృష్టించాడు. 13,839 పరుగులతో గేల్‌ తొలి స్థానంలో ఉండగా.. 10,694 పరుగులతో పొలార్డ్‌ రెండో స్థానంలో.. 10, 488 పరుగులతో షోయబ్‌ మాలిక్‌ మూడో స్థానంలో ఉన్నారు.  

మ్యాచ్‌ విషయానికి వస్తే ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌లో పాండే 61 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వార్నర్‌ 55 పరుగులు చేశాడు. ఇక చివర్లో కేన్‌ విలియమ్సన్‌ (10 బంతుల్లో 26, 4 ఫోర్లు,1 సిక్స్‌) ,కేదార్‌ జాదవ్‌ 12 పరుగులు (1 ఫోర్‌, 1 సిక్స్‌)తో ధాటిగా ఆడడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సీఎస్‌కే బౌలర్లలో ఎన్గిడి 2, సామ్‌ కరన్‌ ఒక వికెట్‌ తీశాడు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై లక్ష్యం దిశగా సాగుతుంది. 15 ఓవర్ల ఆట ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 148/3గా ఉంది. 75 పరుగులు చేసి రుతురాజ్‌ ఔటవ్వగా.. డుప్లెసిస్‌ 56 పరుగులు చేసి ఎల్బీగా వెనుదిరిగాడు.

చదవండి: పవర్‌ ప్లే: తొలి స్థానంలో సీఎస్‌కే.. రెండో స్థానంలో ఢిల్లీ

>
మరిన్ని వార్తలు