'రనౌట్‌ చేశానని నా మీదకు కోపంతో రావుగా'

22 Apr, 2021 16:58 IST|Sakshi
Courtesy : IPL Twitter

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో బుధవారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌ పూరన్‌ డైమండ్‌ డక్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. డేవిడ్‌ వార్నర్‌ అద్బుతమైన త్రోకు పూరన్‌ ఒక్క బంతి ఎదుర్కోకుకుండానే రనౌట్‌‌ అయ్యాడు. ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ను ఖలీల్‌ వేయగా.. ఆఖరిబంతిని గేల్‌ కవర్స్‌ దిశగా షాట్‌ ఆడాడు. పరుగు కోసం గేల్‌ కాల్‌ ఇవ్వడంతో పూరన్‌ ఏం ఆలోచించకుండా క్రీజు దాటి ముందుకొచ్చాడు. అయితే గేల్‌ అప్పటికే సగం క్రీజు దాటేయడంతో పూరన్‌ పరిగెత్తాల్సి వచ్చింది. అప్పటికే బంతిని అందుకున్న వార్నర్‌ మెరుపువేగంతో త్రో విసిరాడు. అది నేరుగా వికెట్లను గిరాటేయడంతో పూరన్‌ డైమండ్‌ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో ఈ సీజన్‌లో పూరన్‌ డకౌట్ల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లాడిన అతను మూడుసార్లు డకౌట్‌ అవ్వడం విశేషం.


ఇక మ్యాచ్‌ అనంతరం డేవిడ్‌ వార్నర్‌ నికోలస్‌ పూరన్‌తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. పూరన్‌ భయ్యా.. రనౌట్‌ చేశానని.. నా మీదకు కోపంతో మాత్రం రావుగా... అంటూ క్యాప్షన్‌ జతచేశాడు. వార్నర్‌ కామెంట్‌ వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ సన్‌రైజర్స్‌ బౌలర్ల దాటికి నిలువలేక 19.1 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌లో  వార్నర్‌ 37 పరుగులు చేసి ఔటవ్వగా.. బెయిర్‌ స్టో 63*, విలియమ్సన్‌ 16*.. మరో వికెట్‌ పడకుండా జట్టును గెలిపించారు. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 25న చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
చదవండి: సూపర్‌ రనౌట్‌.. పూరన్‌ డైమండ్‌ డక్‌

విలియమ్సన్‌ రాకతో మా బలం పెరిగింది: వార్నర్‌

>
మరిన్ని వార్తలు