స్లేటర్‌తో ఘర్షణపై వార్నర్‌ క్లారిటీ

9 May, 2021 13:48 IST|Sakshi

మాలె: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌, ఆ దేశ మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ మైకేల్ స్లేట‌ర్‌లో ఇటీవల మాల్దీవ్స్‌లోని ఓ బార్‌లో కొట్టుకున్నట్లు వచ్చిన వార్త హాట్‌ టాపిక్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ వార్త కు సంబంధించి ఈ ఇద్ద‌రు ఆస్ట్రేలియన్లు వివ‌ర‌ణ ఇచ్చారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్ల‌డంపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వాయిదా పడడంతో ఆసీస్ క్రికెట‌ర్లు, సిబ్బంది మాల్దీవ్స్‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. వాళ్లు అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు పయనమయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

మేము గొడవ పడలేదు..
ఇది ఇలా ఉండగా మాల్దీవ్స్‌లోని ఓ బార్‌లో వార్నర్‌, స్లేటర్‌ గొడవపడినట్లు ద డైలీ టెలిగ్రాఫ్ ఓ స్టోరీ రాసింది. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు ఉన్న తాజ్ కోర‌ల్ రిసార్ట్‌లోనే ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు చెప్పింది. ఈ వార్త పై స్లేట‌ర్‌, వార్న‌ర్ స్పందించారు చెప్పారు. దీనిపై మొద‌ట‌గా స్పందించిన స్లేట‌ర్ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఫిల్ రోత్‌ఫీల్డ్‌కు చేసిన మెసేజ్‌లో.. నేను, వార్న‌ర్‌ ఎప్పటి నుంచో మంచి స్నేహితులం. మా మ‌ధ్య గొడ‌వ జ‌రిగే అవ‌కాశ‌మే లేదు. ఇదంతా పుకారే అని స్ప‌ష్టం చేశాడు. ఆ త‌ర్వాత వార్న‌ర్ కూడా తన వివరణగా.. మీకు ఇలాంటి పుకార్లు ఎక్క‌డి నుంచి వ‌స్తాయో నాకు తెలియ‌డం లేదు. ఇటువంటి వార్తలు రాసే ముందు బ‌ల‌మైన ఆధారాలు ఉంటేనే రాయాలంటూ తెలిపాడు. కాగా గ‌త వారం ఆస్ట్రేలియా ప్ర‌ధానిపై తీవ్రంగా మండిప‌డిన స్లేట‌ర్ వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. భారత్‌ నుంచి వ‌చ్చే ఆస్ట్రేలియన్లపై నిషేధం విధించ‌డంపై స్లేట‌ర్ తీవ్రంగా మండిపడ్డాడు. 
( చదవండి: కేకేఆర్‌ జట్టులో మరో ఆటగాడికి కరోనా )

మరిన్ని వార్తలు