-

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఎవరి మ్యాచ్‌లు ఎక్కువగా చూశారంటే..

9 Oct, 2021 16:22 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌ 2021 సీజన్‌లో సీఎస్‌కే దుమ్మురేపింది. టోర్నీ ముగియకముందే అత్యధిక వీక్షకులను సంపాధించిన జట్టుగా సీఎస్‌కే చరిత్ర సృష్టించింది. సీఎస్‌కే తర్వాత ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లను టీవీల్లో జనాలు ఎక్కువగా వీక్షించినట్లు బార్క్‌ (బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌) తెలిపింది. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో దారుణ ప్రదర్శనతో నిరాశపరిచిన సీఎస్‌కే ఈ సీజన్‌లో దుమ్మురేపడంతో పాటు.. భారీగా వీక్షకులను పెంచుకుంది సీఎస్‌కే ఆడిన ప్రతీ మ్యాచ్‌కు కనీసం 2-3 శాతం వీక్షకులు పెరగడం విశేషం. సీఎస్‌కే ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడులోని చెన్నై మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, బిహార్‌  రాష్ట్రాల నుంచి సీఎస్‌కే మ్యాచ్‌లు ఎక్కువ  మంది చూసినట్లు బార్క్‌ ప్రకటించింది. సీఎస్‌కే తర్వాతి స్థానంలో ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, కేకేఆర్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఉన్నాయి.

చదవండి: IPL 2021: ఈసారైనా వాళ్లు ట్రోఫీ సాధిస్తే చూడాలని ఉంది!


Courtesy: IPL Twtitter

కాగా ఐపీఎల్‌ మ్యాచ్‌లన్ని స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్‌స్పోర్ట్స్‌ హిందీతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో మ్యాచ్‌లు ప్రసారమవుతున్నాయి.  సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 1 మధ్యబార్క్‌) నివేదిక ప్రకారం స్టార్‌స్పోర్ట్స్‌ హిందీ చానెల్‌ మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఐపీఎల్‌ 2021 ఫేజ్‌2 ప్రారంభమైన తర్వాత ఒక వారంలో స్టార్‌స్పోర్ట్స్‌ 1 హిందీ చానెల్‌ మూడోస్థానానికి పరిమితం కావడం ఇదే తొలిసారి. బార్క్‌ నివేదిక ప్రకారం తొలి రెండు స్థానాల్లో సన్‌టీవీ, స్టార్‌ప్లస్‌ ఉన్నాయి.

 కాగా ఐపీఎల్‌ 2020, ఐపీఎల్‌ 2021 తొలిఫేజ్‌ మ్యాచ్‌లు జరిగిన అన్ని వారాలు స్టార్‌స్పోర్ట్స్‌ 1 హిందీ చానెల్‌ తొలి స్థానంలో కొనసాగడం విశేషం. కాగా ఐపీఎల్‌ సెకండ్‌ఫేజ్‌లో తొలివారం దాదాపు 400 మిలియన్ల మంది మ్యాచ్‌ను వీక్షించినట్లు అధికారులు ప్రకటించారు. ఇక ఐపీఎల్ 14వ సీజన్‌ తొలిదశలో​ 35 మ్యాచ్‌లు ముగిసేసరికి 380 మిలియన్ల మంది వీక్షకులను సంపాదించింది. ఐపీఎల్ 2020 కంటే 12 మిలియన్లు ఎక్కువగా ఉండడం విశేషం.

చదవండి: Virat Kohli Celebration: సిక్స్‌తో గెలిపించిన శ్రీకర్‌ భరత్‌.. కోహ్లి రచ్చ రచ్చ

మరిన్ని వార్తలు