అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడం మా కెప్టెన్‌కు బాగా తెలుసు

30 Mar, 2021 16:40 IST|Sakshi

ముంబై: ఏ బౌలర్‌ నుంచి ఎలాంటి ప్రదర్శన రాబట్టాలనేది ఎంఎస్‌ ధోనీకి బాగా తెలుసని స్పిన్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ పేర్కొన్నాడు. ఇప్పటికే చెన్నై టీమ్‌తో చేరిన గౌతమ్‌ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు. ఈ సందర్భంగా గౌతమ్‌ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘ఎంఎస్‌ ధోనీ కెప్టెన్సీలో ఆడటాన్ని బౌలర్లు బాగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే అతను బౌలర్ల బలాన్ని చక్కగా అర్థం చేసుకుంటాడు. అలాగే బౌలర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడం ఎలాగో ధోనీకి బాగా తెలుసు’’ అని వెల్లడించాడు.

కాగా ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. సీఎస్‌కే తన తొలి మ్యాచ్‌‌ని ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో కృష్ణప్ప గౌతమ్‌ని రూ.9.25 కోట్లకి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తొలిసారి చెన్నైకి ఆడుతున్న కృష్ణప్ప గౌతమ్‌ ధోని కెప్టెన్సీలో ఆడుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశాడు. కాగా ఈ సీజన్‌లో ఏ జట్టుకు హోం అడ్వాంటేజ్‌ లేకపోవడంతో.. ఆయా జట్లు త​మ అన్ని లీగ్‌ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో ఆడాల్సి ఉంటుంది.
చదవండి: ఐపీఎల్‌ 2021: ఆర్‌సీబీ ఈసారైనా..

పంజాబ్‌ కింగ్స్‌ కొత్త జెర్సీ.. వారిని కాపీ కొట్టిందా!

మరిన్ని వార్తలు