జెర్సీలో కలర్‌ఫుల్‌గా ఉన్నావు.. మరి టైటిల్ సంగతేంటి!

6 Apr, 2021 11:18 IST|Sakshi

చెన్నై: ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో ఆర్‌సీబీ రూ. 14.25 కోట్లతో దక్కించుకున్న సంగతి తెలిసిందే. గతేడాది సీజన్‌లో మ్యాక్స్‌వెల్‌ కింగ్స్‌ పంజాబ్(పంజాబ్‌ కింగ్స్‌) తరపున దారుణ ప్రదర్శన కనబరిచినా వేలంలో అంత ధరకు పలకడం చూస్తే అతని క్రేజ్‌ ఎలా ఉందనేది అర్థమవుతుంది. ఇటీవలే ఆర్‌సీబీతో కలిసిన మ్యాక్స్‌వెల్‌ జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ను ఆరంభించాడు. ఈ సందర్భంగా ఆర్‌సీబీ జెర్సీ ధరించిన మ్యాక్సీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫోటోను తమ ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీనికి సంబంధించి నెటిజన్లు వినూత్న రీతిలో కామెంట్స్‌ చేశారు.

''మ్యాక్సీ ఈరోజు లేవడంతోనే కలర్‌ఫుల్‌ జెర్సీలో చూడడం ఆనందంగా ఉంది.. ఆర్‌సీబీ జెర్సీతో మ్యాక్సీ ఫోటో కోసం కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నా.. మ్యాక్సీ.. విరాట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభిస్తే బాగుంటుంది.. జెర్సీలో కలర్‌ఫుల్‌గా ఉన్నావు.. టైటిల్‌ సంగతేంటి'' అంటూ  కామెంట్లతో రెచ్చిపోయారు. కాగా మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 82 మ్యాచ్‌లాడి 1505 పరుగులు సాధించాడు. ఇక గతేడాది సీజన్‌లో పంజాబ్‌కు ఆడిన మ్యాక్సీ 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. కాగా ఈ సీజన్‌లో ఆర్‌సీబీ తన తొలి మ్యాచ్‌ను చెన్నై వేదికగా  ఏప్రిల్‌ 9న డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. 
చదవండి: ఐపీఎల్‌ 2021: ఆర్‌సీబీ ఈసారైనా..
ఇప్పటికే ఎన్నో రికార్డులు.. ఊరిస్తున్న మరిన్ని ఘనతలు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు