IPL 2021 Second Phase: ఐపీఎల్‌లో నెట్‌ బౌలర్లుగా విండీస్ బౌలర్లు...

13 Sep, 2021 19:28 IST|Sakshi

దుబాయి:  సెప్టెంబర్‌ 19నుంచి యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్‌ సెకెండ్‌ ఫేజ్‌లో వెస్టిండీస్ ఆటగాళ్లు రవి రాంపాల్, ఫీడెల్ ఎడ్వర్డ్స్,షెల్డన్ కాంట్రెల్, డొమినిక్ డ్రేక్స్ నెట్ బౌలర్లుగా వ్యవహరించబోతున్నారు. అయితే ఈ ఆటగాళ్లు ఏ జట్లలో చేరే అవకాశం ఉందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కాగా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు నెట్‌ బౌలర్లుగా పాల్గొనడం గమనార్హం. ఇటీవల వెస్టిండీస్ ప్రకటించిన 15 మంది సభ్యుల టీ20 ప్రపంచకప్ జట్టులో రాంపాల్‌కు చోటు దక్కింది.

రాంపాల్ ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిబాగో నైట్ రైడర్స్‌ తరుపున ఆడుతున్నాడు. అతడు గతంలో 2013-14 సీజన్లలో బెంగూళూరు రాయల్ ఛాలెంజర్స్‌ తరుపున ఆడాడు. మరో వైపు ఎడ్వర్డ్స్, డ్రేక్స్, కాట్రెల్‌ కూడా  కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నారు. 2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన కాట్రెల్‌ 6 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్ యూఏఈ, ఒమన్‌ లో జరగనున్న నేపథ్యంలో ప్రాక్టీస్‌ కోసమే విండీస్ బౌలర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  కాగా సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ప్రారంభం కానుంది. 

చదవండి: Mankading Out: ఒకే మ్యాచ్‌లో.. ఒకే బౌలర్‌ చేతిలో ఏకంగా ఐదుగురు మన్కడింగ్‌

మరిన్ని వార్తలు