ముంబైతో మ్యాచ్‌ సందర్భంగా మోర్గాన్‌ చేసిన పనిపై మండిపడ్డ కేకేఆర్‌ మాజీ కెప్టెన్‌

27 Sep, 2021 15:47 IST|Sakshi

Gautam Gambhir Lashes Out At Eoin Morgan: ఐపీఎల్‌-2021 రెండో దశలో భాగంగా సెప్టెంబర్‌ 23న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. డగౌట్‌లో కూర్చున్న కేకేఆర్‌ వ్యూహకర్త(అనలిస్ట్‌) నాథన్‌ లీమన్‌ నుంచి ఆ జట్టు కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్ కోడ్ భాష‌లో సూచ‌న‌లు అందుకోవ‌డం క‌నిపించింది. లీమ‌న్‌.. మూడు, నాలుగు నంబ‌ర్ల‌ ఫ్లకార్డులను ఫీల్డ్‌లో ఉన్న మోర్గాన్‌కు చూపిస్తూ అప్ర‌మ‌త్తం చేస్తున్నట్లు కనపించాడు. ఈ వీడియో నాటి నుంచి నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంది. దీనిపై తాజాగా కేకేఆర్‌ మాజీ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు.

మోర్గాన్‌లా డగౌట్‌లో కుర్చున్న వ్యూహకర్త నుంచి సలహాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చుంటే.. తానైతే కెప్టెన్సీ నుంచి తప్పుకునేవాడినంటూ వ్యాఖ్యానించాడు. డగౌట్‌లో కూర్చున్న వ్యక్తులను నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో కేకేఆర్‌ కెప్టెన్‌ ఉన్నాడంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు.  క్రికెట్‌లో నిర్ణయాలు అప్పటికప్పుడు మైదానంలో ఉన్న ఆటగాళ్లే చర్చించి తీసుకోవాలని, ఇలా బయటి వ్యక్తుల సలహాలు తీసుకునే పద్ధతి కరెక్ట్‌ కాదని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గంభీర్‌.. సహచర కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా అడిన ప్రశ్నపై స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. 

ఇదిలా ఉంటే, కేకేఆర్‌ జట్టుకు అన‌లిస్ట్‌గా వ్యవహరిస్తున్న నాథ‌న్ లీమ‌న్‌.. ఇంగ్లండ్ జట్టుకు కూడా అన‌లిస్ట్‌గా సేవలందిస్తున్నాడు. లీమన్‌, మోర్గాన్‌ కాంబినేషన్‌లో ఇంగ్లండ్‌ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుంది. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జ‌రిగిన లిమిటెడ్‌ ఓవర్స్‌ సిరీస్‌లోనూ వీరి జోడీ ఇలా కోడ్ నంబ‌ర్ల‌తో సంభాషించుకుంటూ కనిపించింది. దీనికి సంబంధించిన సన్నివేశాలు అప్పట్లో వైరలయ్యాయి. కాగా, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌ జట్టు 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.  
చదవండి: ఇంగ్లండ్‌ అభిమానులకు షాకిచ్చిన మొయిన్‌ అలీ..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు