‘వారివల్లే ఆర్సీబీకి..వేలానికి ముందు రోజు జరిగింది అదే’

13 Apr, 2021 17:28 IST|Sakshi

చెన్నై:  ఈ ఐపీఎల్‌-14 వ సీజన్‌లో భాగంగా ఫిబ్రవరిలో జరిగిన వేలంలో ఆసీస్‌ ఆల్‌ రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ భారీ ధరకు అమ్ముడుపోయాడు.  మ్యాక్స్‌వెల్‌ కోసం ఆర్సీబీ కడవరకూ పోటీలో నిలిచి సొంతం చేసుకుంది. అతని కోసం భారీ మొత్తం చెల్లించింది ఆర్సీబీ. 14 కోట్ల 25 లక్షల భారీ ధర వెచ్చించి మరీ మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసింది. తాము ముందస్తు వ్యూహం ప్రకారమే ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ను సొంతం చేసుకున్నట్లు ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌  కోహ్లి ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మ్యాక్సీని దక్కించుకోవడం తీవ్ర పోటీ ఎదురైనా అతన్ని దక్కించుకోవాలని ముందే నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.  మ్యాక్స్‌వెల్‌ కావాలనుకున్నాం కాబట్టే అతన్ని టార్గెట్‌ చేసి వేలంలో పోటీ పడ్డామన్నాడు.  

‘ఆ ఇద్దరి వల్లే ఆర్సీబీకి ఆడుతున్నా’
అసలు వేలానికి ముందు రోజు ఏమి జరిగిందనే విషయాన్ని మ్యాక్స్‌వెల్‌ వెల్లడించాడు. ‘ ఐపీఎల్‌ వేలానికి అంతా ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో నా సహచర ఆటగాడు ఆడమ్‌ జంపా, నేను న్యూజిలాండ్‌లో ఉన్నాం.  ఆ సమయంలో ఆడమ్‌ తన వద్దనున్న ఆర్సీబీ క్యాప్‌ను  బ్యాగ్‌లోంచి తీశాడు. అలా తీస్తూనే నా తలపై పెట్టాడు. ఈ ఫోటో తీసి ఆర్సీబీ కెప్టెన్‌ కోహ్లికి పంపాడు. ఆ క‍్రమంలోనే ఒక మెస్సేజ్‌ను కూడా పోస్ట్‌ చేశాం. ఇది నిజంగా ఒక సరదా స్టోరీ. వేలం రోజు న్యూజిలాండ్‌లో రాత్రి.  ఆ సమయంలో మేమంతా క్వారంటైన్‌లో ఉన్నాం. అప్పుడు ఆర్సీబీ క్యాప్‌ తీసి నాకు పెట్టడం, కోహ్లికి ఫోటో పంపడం అంతా జరిగిపోయింది.

కోహ్లికి ఫోటో పంపే క్రమంలో ఇక అంతా అయిపోయింది. నేను ఇప్పటికీ ఆర్సీబీ ఫస్ట్‌ క్యాప్‌ను మ్యాక్స్‌వెల్‌కు ఇచ్చేశా అని కోహ్లి సందేశం పంపాడు. ఇది వేలానికి ముందు జరిగింది. అలా ఆర్సీబీలోకి వచ్చా. కానీ ఒక అనుమానం ఉంది. అది వర్కౌట్‌ కాకపోతే, నన్ను ఆర్సీబీ తీసుకోలేకపోతే ఏంటి అనుకున్నా. ఎందుకంటే వేలానికి ముందు ఆర్సీబీ క్యాప్‌ పెట్టుకుని దిగిన ఫోటోను మేము కోహ్లి పంపాం. ఇది విషయంపై కోహ్లితో చాట్‌ చేశా. అలా ఏమీ ఉండదు అని కోహ్లి భరోసా ఇచ్చాడు’ అని మ్యాక్స్‌వెల్‌ ఆర్సీబీ సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ద్వారా స్పష్టం చేశాడు. ఈ మేరకు ఒక వీడియోను పోస్ట్‌ చేశాడు. 

ఇక్కడ చదవండి: పేరు, జెర్సీ మారినా ఇంకా హార్ట్‌ ఎటాక్‌ తెప్పిస్తున్నారు!

ఉమేశ్‌ యాదవ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. షాక్‌ తిన్న రహానే

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు