ఐపీఎల్‌ 2021: వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చు..

26 Apr, 2021 17:39 IST|Sakshi

ముంబై: కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా ఐపీఎల్ ఆడటాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోతున్నారు పలువురు క్రికెటర్లు. ఈ సీజన్‌ ప్రారంభమైన రెండు వారాలకు పైగా అయిన నేపథ్యంలో కఠినతరమైన బయోబబుల్‌ను భరించలేక ఒక్కక్కరూ ఇంటిదారి పడుతున్నారు. పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇప్పటికే ఐపీఎల్‌కు గుడ్‌ బై చెప్పగా, స్వదేశీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న రవిచంద్రన్‌ అశ్విన్‌.. తల్లిదండ్రులకు కరోనా సోకడంతో వారికి అండగా ఉండేందుకు లీగ్‌ను వీడాడు,. 

కరోనా ప్రభావం ఇప్పటివరకూ ఐపీఎల్‌పై పెద్దగా ఎఫెక్ట్‌ చూపకపోయినా ఇప్పుడు వరుసగా వీడుతున్న క్రికెటర్లతో ఆ లీగ్‌కు కళ తప్పేలా కనబడుతోంది. ఇంకా సగం సీజన్‌ కూడా అవ్వకుండానే క్రికెటర్లు ఇలా ఇంటిదారి పట్టుతున్న తరుణంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అందుకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు.

తాజాగా బీసీసీఐ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఎవరు వెళ్లిపోయినా ఆపవద్దనే బోర్డు తెలిపినట్లు తెలుస్తోంది. ‘ఐపీఎల్‌ జరుగుతుంది. ఎవరైనా వెళ్లిపోవాలనుకున్నా మంచిది. ఈ మెగా ఈవెంట్‌ కొనసాగుతోంది. ఇది ఆగదు. ఎవరైనా వెళ్లాలనుకుంటే నేరుగా వెళ్లిపోవచ్చు. అంతకంటే మంచిపరిణామం’ ఉండదు’ అని ఒక బీసీసీఐ సీనియర్‌ అధికారి కొద్దిపాటి అసంతృప్తి వెళ్లగక్కారు. 

ఇక్కడ చదవండి: మీ విదేశీ ఆటగాళ్లను ఇవ్వండి: ఆర్‌ఆర్‌ రిక్వెస్ట్‌
హర్షల్‌ వస్తుంటే.. ధోని జోకులు.. రైనా నవ్వులు

మరిన్ని వార్తలు