'కేకేఆర్‌కు భజ్జీ కీలకంగా మారనున్నాడు'

7 Apr, 2021 12:53 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కేకేఆర్‌కు టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కీలకంగా మారనున్నాడని మాజీ బౌలర్‌ ప్రగ్యాన్‌ ఓజా జోస్యం చెప్పాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓజా మాట్లాడుతూ.. టీమిండియా తరపున హర్భజన్‌ సింగ్‌ ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. అతని అనుభవం ఈ ఐపీఎల్‌లో ఎంతో ఉపయోగపడుతుంది. భజ్జీ తుది జట్టులో ఉంటే మాత్రం కేకేఆర్‌కు కీలకంగా మారుతాడు. అయితే కరోనా దృష్యా ఏ జట్టుకు సొంత మైదానంలో ఆడే వెసులబాటు కల్పించకపోవడంతో ఆయా ఫ్రాంచైజీలు తటస్థ వేదికల్లో ఆడనున్నాయి.

ఇక భజ్జీ గతంలో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌ తరపున ఆడడంతో ఆయా వేదికల్లో భజ్జీ కీలకపాత్ర పోషించనున్నాడు. సీఎస్‌కేకు రైనా అనుభవం ఎలా ఉపయోగపడుతుందో.. కేకేఆర్‌కు హర్భజన్‌ అలా అవసరమవుతాడు. గతేడాది సీజన్‌కు ఈ ఇద్దరు దూరంగా ఉన్నా.. ఇప్పటికే ప్రాక్టీస్‌లో తలమునకలవడంతో మళ్లీ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు. అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా హర్భజన్‌ వ్యక్తిగత కారణాల రిత్యా గత సీజన్‌కు దూరంగా ఉన్నాడు. అయితే ఫిబ్రవరిలో జరిగిన వేలంలో హర్భజన్‌ను కేకేఆర్‌ రూ. 2 కోట్ల కనీస మద్దతు ధరకే సొంతం చేసుకుంది. ఇటీవలే ఏడు రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న హర్భజన్‌ జట్టుతో చేరి ప్రాక్టీస్‌ ఆరంభించాడు. ఇక కేకేఆర్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 11న చెన్నై వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడనుంది.
చదవండి: IPL 2021: మరో స్టార్‌ ఆటగాడికి కరోనా

కోహ్లి, రోహిత్‌ల నుంచి మెసేజ్‌లు వచ్చాయి: శాంసన్‌

>
మరిన్ని వార్తలు