సూర్య యాక్షన్‌.. హార్దిక్‌ రియాక్షన్‌

13 Apr, 2021 21:24 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కేకేఆర్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సూర్యకుమార్‌ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 36 బంతుల్లో 56 పరుగులు చేసిన సూర్య ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కాగా సూర్యకుమార్‌ 44 పరుగుల వద్ద​ ఉన్నప్పుడు కమిన్స్‌ బౌలింగ్‌లో డీప్‌ స్వ్కేర్‌ వికెట్‌ మీదుగా కొట్టిన సిక్స్‌ హైలెట్‌గా నిలిచింది. 99 మీటర్ల ఎత్తులో వెళ్లిన ఆ సిక్స్‌ గ్రౌండ్‌ అవతల పడింది. దీంతో సూర్య అర్థశతకం కూడా పూర్తైంది. అయితే సూర్య కొట్టిన సిక్స్‌పై హార్దిక్‌ పాండ్యా ఇచ్చిన రియాక్షన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

హార్ధిక్‌ ఇచ్చిన రియాక్షన్‌ ఎలా ఉందంటే.. సూర్య కొట్టింది సిక్స్‌ పోతుందా పోదా అన్న తరహాలో కళ్లు పెద్దవి చేసి నోరు వెళ్లబెట్టాడు. అయితే అది సిక్స్‌గా వెళ్లడంతో హార్ధిక్‌ ఊపిరి పీల్చుకుంటూ చప్పట్లతో అభినందించాడు. కాగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ ఆధ్యంతం నిధానంగా సాగింది. సూర్యకుమార్‌ మినహా ఎవరు దాటిగా ఆడకపోవడంతో ముంబై పెద్దగా స్కోరు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: బౌలింగ్‌లో స్థిరత్వం.. అతనికి కోట్లు వచ్చేలా చేసింది

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు