ప్లీజ్‌.. డివిలియర్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ ఆడుతాడా చెప్పండి

18 Apr, 2021 20:06 IST|Sakshi
Cortesy : IPL Twitter

చెన్నై: ఆర్‌సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ విధ్వంసం సృష్టిస్తే ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తన హిట్టింగ్‌ పవర్‌ ఏంటో మరోసారి రుచి చూపించాడు. చెపాక్‌ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ 34 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.  ఆర్‌సీబీ జట్టు స్కోరు 91/3 వద్ద ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌ మ్యాక్స్‌వెల్‌తో కలిసి కేకేఆర్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. అయితే మ్యాక్స్‌వెల్‌ ఉన్నంతవరకు తన బ్యాటింగ్‌ పవర్‌ని చూపించని ఏబీ ఆ తర్వాత తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ముఖ్యంగా లాంగాన్‌, డీప్‌స్క్వేర్‌ మిడ్‌వికెట్‌ మీదుగా కొట్టిన సిక్సర్లు పాత ఏబీని గుర్తుచేశాయి. 

కాగా ఏబీ డివిలియర్స్‌ 2018లో అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పాడు. అయితే అప్పటినుంచి ఐపీఎల్‌లో రెగ్యులర్‌గా ఆడుతూ వస్తున్న డివిలియర్స్‌ 2020లో తాను క్రికెట్‌లోకి మళ్లీ రావాలనుకుంటున్నానని.. 2021 టీ20 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా తరపున ఆడాలని ఉందంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు. తాజాగా డివిలియర్స్‌ మరోసారి సిక్సర్లతో రెచ్చిపోవడంతో సోషల్‌ మీడియాలో అతనిపై మీమ్స్‌,ట్రోల్స్‌ వర్షం కురిపిస్తున్నారు. బ్యాడ్‌ పిచ్‌పై పరుగులు ఎలా రాబట్టాలో ఏబీ చూపించాడు.. ఈరోజు డివిలియర్స్‌ ఇన్నింగ్స్‌ చుశాకా.. నా గుండె మీద చేయి వేసుకొని హాయిగా ఉంటా.. ఈసారి కప్‌ ఆర్‌సీబీదే.. ఆర్‌సీబీ ఎ‍ప్పుడు కష్టాల్లో ఉన్నా .. డివిలియర్స్‌ నేనున్నాంటూ ముందుకొస్తాడు.. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో డివిలియర్స్‌ ఆడుతున్నాడా .. ప్లీజ్‌ ఎవరైనా చెప్పండి అంటూ కామెంట్లతో రెచ్చిపోయారు. కాగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 38 పరుగులతో గెలిచి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. మ్యాక్స్‌వెల్‌ 49 బంతుల్లో 78 పరుగులతో ఈ సీజన్‌లో రెండో అర్థ సెంచరీని సాధించాడు. 
చదవండి: పాపం  బౌల్ట్‌.. బంతిని పట్టుకోలేక
రోహిత్‌ షూపై ఈసారి ఏం రాసుకొచ్చాడో తెలుసా.. 

మరిన్ని వార్తలు