నేను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు: భజ్జీ

31 Mar, 2021 20:23 IST|Sakshi

ముంబై: 40 ఏళ్ల వయసులో తాను ఐపీఎల్‌ ఆడటంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో  టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్‌ సింగ్ ఘాటుగా స్పందించాడు. నా విషయమై చర్చింకునే వారికి నేను కొత్తగా నిరూపించుకోవల్సిందేమీ లేదని, నాకు ఆడాలని అనిపించినన్ని రోజులు క్రికెట్‌లో కొనసాగుతానని బదులిచ్చాడు. ఆట పరంగా తనకంటూ కొన్ని స్టాండర్డ్స్‌ సెట్‌ చేసుకున్నాని, అందులో విఫలమైతే తన్ను తానే విమర్శించుకుంటానని, ఇతరులకు ఎప్పుడూ ఆ అవకాశం ఇవ్వనని పేర్కొన్నాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు తరఫున వంద శాతం పర్ఫార్మ్‌ చేయడమే తన ముందున్న లక్ష్యమని, అనవసరపు చర్చలపై స్పందించి, తన టైమ్‌ను వేస్ట్‌ చేసుకోదలుచుకోలేదని ప్రకటించాడు.  

కాగా, వ్యక్తిగత కారణాల వల్ల గతేడాది ఐపీఎల్‌కు దూరంగా ఉన్న భజ్జీని చెన్నై సూపర్‌ కింగ్స్‌ రిలీవ్‌ చేయగా, ఈ ఏడాది వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అతన్ని కనీస ధరకు(2 కోట్లు) సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ ప్రారంభ ఎడిషన్‌ నుంచి 2017 వరకు ముంబై ఇండియన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ పంజాబీ స్పిన్నర్‌ 2018, 2019 సీజన్లలో చెన్నైకు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 700కుపైగా వికెట్లు సాధించిన భజ్జీ.. తాను ప్రాతినిధ్యం వహించిన ఆఖరి సీజన్‌లో(2019) 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు సాధించి శభాష్‌ అనిపించాడు. భజ్జీ తన ఓవరాల్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో 160 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు సాధించాడు.
చదవండి: టాప్‌లో కొనసాగుతున్న కోహ్లి..

మరిన్ని వార్తలు