దురదృష్టంకొద్దీ మావి అలా వేయలేదు: పృథ్వీ షా

30 Apr, 2021 10:08 IST|Sakshi

అహ్మదాబాద్‌:  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జరిగిన మ్యాచ్‌లో ఢీల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించడంలో ఆ జట్టు ఓపెనర్‌ పృథ్వీ షా కీలక పాత్ర పోషించాడు. ఏకపక్షంగా సాగిన పోరులో పృథ్వీ షా  41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82 పరుగులు సాధించాడు. పృథ్వీ షా బ్యాట్‌ ఝుళిపించడంతో కేకేఆర్‌ నిర్దేశించిన 155 పరుగుల టార్గెట్‌ను ఢిల్లీ 16.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా పృథ్వీ షాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో పృథ్వీ షా మాట్లాడుతూ.. నేను దేని గురించి ఆలోచించలేదు. కేవలం చెడ్డ బంతులు కోసమే నిరీక్షించా. మేము నాలుగు-ఐదేళ్ల నుంచి శివం మావి(కేకేఆర్‌ బౌలర్‌) తో కలిసి ఆడుతున్నాం.  ‘నాకు బంతులు ఎలా వేస్తాడో తెలుసు. అతని వేసే షార్ట్‌ బాల్‌కు పూర్తిగా సన్నద్ధమయ్యా.  తొలి నాలుగు-ఐదు బంతులు హాఫ్‌ వాలీ వేసిన తర్వాత షార్ట్‌ బాల్‌ వేస్తాడు. కానీ  దురదృష్టంకొద్దీ మావి అలా వేయలేదు. ఈ వికెట్‌పై స్పిన్నర్లను ఆడటం కష్టంగా అనిపించింది. బ్యాట్‌పైకి సరిగా రాలేదు. దాంతో స్పిన్నర్లు ఆఫ్‌ స్టంప్‌, అవుట్‌ సైడ్‌ బంతులు వేసే వరకూ వెయిట్‌ చేసి హిట్‌ చేశా’’ అని చెప్పుకొచ్చాడు. 

ఇక ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ మట్లాడుతూ.. పృథ్వీ షాను ఆకాశానికెత్తేశాడు. ‘పృథ్వీ షా టాలెంటెడ్‌ ప్లేయర్‌. అది మనందరికి తెలుసు. కానీ అతనిలో​ ఆత్మవిశ్వాసాన్ని నింపితే అద్భుతాలు చేస్తాడనే విషయం మళ్లీ రుజువైంది. నేను పృథ్వీకి ఒకటే చెప్పా. నీ సహజ సిద్ధమైన ఆటను ఆడమనే చెప్పా. మేము రన్‌రేట్‌ను దృష్టిలో పెట్టుకునే ఆడాం. నేను మా యువ క్రికెటర్లకు ఒకటే చెబుతా. క్రికెట్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఆడమనే చెబుతా. సాధ్యమైనంత వరకు మన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ట్రై చేయమంటా. లలిత్‌ యాదవ్‌ ఒక ఆల్‌రౌండర్‌. కానీ అతనికి బ్యాటింగ్‌ చేయడానికి పూర్తిస్థాయిలో అవకాశం రావడం లేదు. గత మ్యాచ్‌లో మేము పరుగు తేడాతో ఓటమి చెందాం. కెప్టెన్సీని ఎంజాయ్‌ చేస్తున్నా’ అని తెలిపాడు. 

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు