ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యామిలీని మిస్సవుతున్నా

23 Apr, 2021 18:53 IST|Sakshi

ఐపీఎల్‌ నుంచి నటరాజన్‌‌ ఔట్‌

ఆ యార్కర్ల స్పెషలిస్టు  వీడియో షేర్‌ చేసిన ఫ్రాంచైజీ

చెన్నై:  ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఇంకా సగం కూడా పూర్తవకుండానే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ టి నటరాజన్‌ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఈ టోర్నీలో మోకాలి గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన నటరాజన్‌.. ఆ  గాయం తీవ్రం కావడంతో వైదొలగక తప్పలేదు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ తన ఇన్‌స్టా హ్యాండిల్‌ ద్వారా స్పష్టం చేసింది. నటరాజన్‌ ఎమోషనల్‌ అవుతూ జట్టును వీడుతున్న వీడియోను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోస్ట్‌ చేసింది.  ఇందులో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యామిలీని వీడాల్సి రావడం బాధిస్తోందని, కానీ తప్పడం లేదని నటరాజన్‌ ఎమోషనల్‌ అయ్యాడు.

ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్‌ ఆడిన గత మ్యాచ్‌లో నటరాజన్‌ ఎందుకు ఆడలేదనే అనుమానం తలెత్తింది. కాగా నటరాజన్‌ మోకాలి గాయంతో మ్యాచ్‌కు దూరమైన విషయాన్ని  ఎస్‌ఆర్‌హెచ్‌ మెంటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలిపిన తర్వాత విషయం అర్థమైంది. అతనికి మోకాలికి శస్త్ర చికిత్స అవసరం కావడంతో అతను అర్థాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు.  ఈ ఏడాది రెండు మ్యాచ్‌లే ఆడిన నటరాజన్‌ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. 

గత సీజన్‌లో సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరడంలో నటరాజన్‌  కీలక పాత్ర పోషించాడు. దాంతోనే భారత్‌ సెలక్షన్‌ కమిటీ నుంచి నటరాజన్‌కు పిలుపు రావడంతో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయడం జరిగింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు నటరాజన్‌. ఒకే టూర్‌లో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన ఏకైక భారత క్రికెటర్‌ నటరాజన్‌. 

A post shared by SunRisers Hyderabad (@sunrisershyd)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు