తాహిర్‌ సూపర్‌ రనౌట్‌.. ఈ వయసులోనూ

25 Apr, 2021 19:53 IST|Sakshi
Courtesy: IPL Twitter

ముంబై: ఆర్‌సీబీతో మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు ఇమ్రాన్‌ తాహిర్‌ సూపర్‌ రనౌట్‌తో మెరిశాడు. ఈ సీజన్‌లో తాహిర్‌కు ఇదే మొదటి మ్యాచ్‌.. కాగా ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ చివరి బంతిని జేమిసన్‌ స్వేర్‌లెగ్‌ దిశగా ఆడాడు. అయితే తర్వాతి ఓవర్‌ స్ట్రైక్‌ తీసుకోవాలని భావించిన జేమిసన్‌ చహల్‌కు కాల్‌ ఇచ్చాడు. అయితే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉ‍న్న చహల్‌ క్రీజు నుంచి కదిలి పరుగు రావడం కష్టమని భావించి మళ్లీ వెనక్కి వచ్చేశాడు. అయితే జేమిసన్‌ క్రీజు వదిలి ముందుకు రావడం.. అప్పటికే స్వేర్‌లెగ్‌లో ఉన్న తాహిర్‌ డైరెక్ట్‌ త్రో విసరడంతో నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో జేమిసన్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. తాహిర్‌ చేసిన రనౌట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ''తాహిర్‌ వచ్చీ రావడంతోనే ఇరగదీశావ్‌.. ఈ వయసులోనూ సూపర్‌ డైరెక్ట్‌ త్రో..'' అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇక బౌలింగ్‌లోనూ తాహిర్‌ మెరిశాడు. 4 ఓవర్లు వేసి 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.అందుకుంది. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. పడిక్కల్‌(34) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మ్యాక్స్‌వెల్‌ 22 పరుగులు చేయగా.. మిగతావారు సీఎస్‌కే బౌలర్ల దాటికి అలా వచ్చి ఇలా వెళ్లారు. సీఎస్‌కే బౌలర్లలో జడేజా 3, తాహిర్‌ 2, శార్ధూల్‌, సామ్‌ కరన్‌ చెరో వికెట్‌ తీశారు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఆడిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటింగ్‌లో జడేజా 62 నాటౌట్‌ మెరుపులు మెరిపించగా.. డుప్లెసిస్‌ 50 పరుగులతో రాణించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 3, చహల్‌ ఒక వికెట్‌ తీశారు.
చదవండి : ఒక్క ఓవర్‌.. 37 పరుగులు.. జడ్డూ విధ్వంసం

మరిన్ని వార్తలు